అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

11, ఏప్రిల్ 2020, శనివారం

తుమ్ముకు తమ్ముడు..దశదిశలా.,

తుమ్ముకు తమ్ముడు..దశదిశలా.,

డ్రేగన్ వుహాన్ ఉమ్మింది
ఉపద్రవం గా మారింది
హచ్-ఉచ్ఛిష్ఠ కరోనా
మందులకందని-ఆనైజం

సమస్త విశ్వం తాకింది
చైనా కరోన ఈ నా ధరాన
వెంట్రుక వాసికి వెయ్యోవంతు
అంతుబట్టని మహమ్మారిగా
కోవిడ్19 ప్రాపంచీకరణ
ముట్టుకుంటే అంటుకుంటా
చుట్ట బెడతా
చూడు నా ప్రతాపం
కట్టగీసిన గట్టుగట్టినా
చైనాగోడలనే దాటుకుంటూ
ఉనికి చాటితి ఉలికిపడగా
కర్కశ రక్కసి కరాళ హేలన

భూమిపైన గాలిలోనా
జలములందున ఉండనట్టే
పంచభూతములందు ఇమడను
పాంచభౌతిక వ్యాప్తి గలిగి

ఇంచుమించు ముంచువరకు
సంచితంబుల వ్రాలు నా చెల్లుచీటీ 
చిరునామా చెప్పను
మీసం మెలేయు మీహాసం
నాముట్టడి కట్టడి
చేయలేని ప్రబలదోషం
ముట్టుకుంటివా దిట్టగ‌రాదు

ఓ తీర్థంకరా!

కరచాలన వరమేళన నమస్కృతులు

ఒద్దిక మీర ముద్దుగబ్రతికే విశ్వంభరలో
హద్దులుచెరపి బుద్ధుల పద్దులనేమార్చి
అంటగాగుతూ ఒకటేనంటావ్ వుంటావ్
నాగరీకమై సాగనంపగా నేనొస్తావుంటే...

కరోన మహాబిరాన నీదారెటు గోదారేనా?

స్వార్థపు అర్ధమే పరమార్ధంగా
అర్థంపర్థంలేని-జావగారిన యావలతో 
ఇహపరలోకాలకు సోపానంగా
ఉఛ్ఛిష్ఠ కశ్మలంలో మనం-
జనం- నలగడమే మనుగడా?

జవాబులేని ప్రశ్నలుండవు-నిజమే గాని
ప్రశ్నార్థకమైన బ్రతుకులు నేటికీ లే వా?
 మసిలి తెలుసుకో మనీషి
 మలికితనం నీలోనే సన్నాసి 
 కరోనవైపరీత్య అస్తిమత్వ కన్నీళ్లు
 కొన్నాళ్ళే ...ఇంకొన్నాళ్ళే....
 ఆశావహ దార్శనికత్వం
 తత్వం....మానవత్వం
 సత్యం ..నిత్యగత్యం..జగత్వం