అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

16, జూన్ 2017, శుక్రవారం

ఆశువుగా తెనుగింపు

వరమేకో గుణీపుత్రః
నచ మూర్ఖ శతాన్యపి|
ఏకశ్చంద్రః తమోహంతి
నచ తారా సహస్రసః||

ఆశువు గా తెనిగింపు పద్యం,

తేగి || కొమరుడొక్కడు జాలును గుణమణిగన
          కౌరవేంద్రుని మాడ్కిగ గనుట యేల
          రాత్రి భాసిల్లు నేతార గాత్ర వితతి
          పూర్ణ బింబమై చంద్రుండు ముదము గొలుపు
---------- పరాక్రి

••••••••••••••••••••••••••••••••••••
వంద మంది మూర్ఖలుకన్న
మంచి గుణము కలిగిన ఒక్కడు చాలు
నక్షత్రాలు ఎన్ని ఉన్నా ప్రకాశించే
చంద్రుడు ఒక్కడు చాలు