అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

Thursday, April 18, 2013

యాకుందేందు తుషారహార........ శ్లో || నకు తెనిగింపు

    ( యాకుందేందు తుషారహార........ శ్లో || నకు తెనిగింపు )

ఉ||  కుందము నిందుచందము నికుంజ తుషారముబోలి తెల్లనౌ
       చందములీను వస్త్రముల సంస్థిత పద్మము నాసనంబుగా
       వందిత వీణ దాల్చు ఘన వాగధి దేవత నిన్ను గొల్తు రా
       బృంద జగ ద్రిమూర్తులును భారతి నా జడతార్తి బ్రోవవే ||

                 - పరాక్రి
Thursday, April 11, 2013

విజయ నామ సంవత్సర ఉగాది ఆహ్వానం


స్వాగత మమ్మా విజయ
రాగాల తో కోయిలమ్మ రమ్మని పిలిచే
పొంగెను ఆమని నినుగని
భాగమె కవితా ప్రసన్న భారతిగూడెన్ ||

                    - పంతుల జయ మహేశ్వరిP.V.RADHAKRISHNA,
CELL :
+91 9966680542, +91 9966455872, +917659931592


Email :
parakrijaya@gmail.com (or) pantula.parakrijaya@mail.com

Wednesday, April 10, 2013

విజయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం

ఉగాది శుభాకాంక్షలతో.........


P.V.RADHAKRISHNA,
CELL :
+91 9966680542, +91 9966455872, +917659931592


Email :
parakrijaya@gmail.com (or) pantula.parakrijaya@mail.com

విజయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం కందాయ ఫలము వర్ష,జగర్లగ్నఫలం నవనాయక ఫలం


విజయ నామ సంవత్సర రాశి ఫలితాలకై మీ రాశి పై క్లిక్ చేయండి.

Copyright © http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/

Friday, April 5, 2013

శంకరాభరణం బ్లాగులో నా పూరణ -2

శంకరాభరణం బ్లాగులో నా పూరణ

సమస్యాపూరణం – 1014 (తగినది గాదయ్య వేద) 

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తగినది గాదయ్య వేదధర్మము మనకున్.

 పూరణ : శ్రీమతి పంతుల జయ మహేశ్వరి
  సెగలుగ విలయపు మనుగడ
  తగినది గాదయ్య , వేద ధర్మము మనకున్
  జగతికి, మేలును గూర్పగ
  తగు విలువల నిచ్చి శాంతి తన్యతబెంచెన్ ||