అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

11, అక్టోబర్ 2016, మంగళవారం

దుర్గ సీసజము

సీ॥
ఆయమ్మ దయలతో ఆరంభమైనట్టి
          పద్యమౌ గద్యమౌ హృద్య మంబు
గీర్వాణ శార్వాణి కేలునుంబట్టగా
               అక్షర క్రమములందాడుకొనమె
యక్షీణ లక్ష్మిగా యామమౌ భామినిన్
              సంపాద సామ్రాజ్ఞి సాహితముగ
మంగళ ప్రదమైన మాన్యాభిమానమై
               మానవోద్రేకతన్ మసలుచుండ

సత్కవిత్వపు భాషణా సారసంబు
మహిత మాన్యత దేదీప్యమాన మగుచు
మనము వికసించు మాధురీ మలయజముగ
దుర్గ మాయమ్మ యీవుత దూరదృష్టి

నా భార్య కోరికపై ఆశువుగా చెప్పన సీస పద్యమిది.

అంబ దయ ఉంటే పద్యమైన గద్యమైన హృద్యమంగా వస్తుంది అమ్మవారి చేయి పట్టుకుంటే అక్షరాలతో ఆడుకోవచ్చు. సాహిత్య సంపద క్షీరసాగర కన్యగా (లక్ష్మీ ) లభ్యమవుతుంది. మంగళగౌరి కవితా ప్రేరేపితమై మాన మానవ గౌరవాన్ని అందిస్తుంది ఇది కవిత్వ భాషణ. దేదీప్య భూషణ మనోవికాసానికి  మలయ మారుతం. దుర్గాదేవి అట్టి దృష్టిని కలుగ జేయును (ముగ్గురమ్మల ప్రశక్తి తో ఇది సీస పద్య తాత్పర్యము )

10, అక్టోబర్ 2016, సోమవారం

దంతి కందళి

1.మృత్తిక మూర్తిని `గణపతి `
   నెత్తుగ నీవిగ్ర హంబు లేర్పడ భువిలో
   నిత్తెము భద్ర నిమజ్జన
   ఉత్తరు పాశన స్మరింప ధన్యత  దంతీ//

2. సత్తువ నిచ్చెడి ' గణపతి'
    విత్తము బొత్తము మరేమి వివిధా గమముల్
    ఎత్త రి నైనను బొందగ
    తత్తర పాటేల ? నిన్ను  దలచిన దంతీ//

3. అత్తరి కైలా సములో
    సత్తె మవిఘ్నము కుమార సామిన్ గెలువన్ /
    ఉత్తమ థీగురు ముల్లో
    కోత్తము డనరా  ! ప్రసిధ్ధ  కోవిద దంతీ //

4. ఉత్తర దిక్కున వెదుకగ
    నుత్తారించిన ముఖమును నుద్యమ గతితో
    అత్తించిన హస్తీశా
    తాత్తా వేత్తా విధాత ధాతా దంతీ /

5. దుత్తాకాశ మదెంతయొ
   చిత్తైకోధృతి హసింప శీతుని వగతో
   భిత్తిం శపింప కథలై
   మిత్తికి మింటికిని గలిగె మీదయ దంతీ/

6. పొత్తము వ్రాయగ కలమై
   ముత్తెపు మునిపంటి సగము మూర్తంబయ్యెన్
   లత్తు వినాయక భారత
   హోత్తా వ్యాసా సువాస హో " గం "   దంతీ /

7. మొత్తము ఇరువది యొకటిగ
    దత్తసమర్పణ విధాన దయ సేయగదే /
    దత్తూర పత్ర గరికలు
    సొత్తుగ గైకొని శుభముగ జూడుము దంతీ/

8. మత్తేభంబును జూచిన
    చిత్తములో --చిత్రమైన-- శ్రీగణనాథా /
    తత్తేజంబును గొలిచిన
    ఉత్తమ గతులెల్లగల్గు నుర్విని దంతీ/

9. విత్తముగా గల కవితా
    మత్తంత్రాక్షర సుభిక్ష మాన్యా ఖనిలో
    ఉత్తానోత్థిత ప్రభవము
    నుత్తేజితపద్య పంక్తి నుండుమ దంతీ //

1౦.గుత్తా ధిపత్య మెవనిది
       సత్తా చూపిం పగలడ- సామాన్యులకు
       న్మత్తుల కప్పుడె విఘ్నము
       జాత్తము నృత్తము జగతిని జాయప దంతీ/

11. నృత్త వినాయక నాయకు
       వృత్తములారయ సుబోధ వృత్తాగ్రేశా
        క్రొత్తగ బహు రూపంబుల
        నెత్తిన గౌరీ తనూజ నిర్మల దంతీ/

12. ఎత్తుకు గుజ్జగు రూపము
       కుత్తుక నతికిన గజముఖ కోమల నయనా
       ఇత్తెరగు చెవులు చాటలు   
       చిత్తరువేయగను జూడ చిత్రము దంతీ/     

13. హత్తుకునానుకు నుండును
      బొత్తిగ చిన మూషికంబు  బ్రోచిన దొరనే
      సత్తువ మోయగ దగునో
      విత్తుకు పెను వృక్షభరము వింతగు దంతీ/

14. చిత్తడి ధారలు గురియగ
      పుత్తడి పండంగ నిండె పుడమిని వడిగా
      దుత్తునియగ భాద్రపద మా
      సాత్తుగ లంబోదర వర సాక్షీ దంతీ/

15. వత్తాసిచ్చెను దొలకరి
      బత్తాయి వెలగ యరంటి బహు ఫలములతో
      గుత్తులు పత్రులు గూరిచి
      మెత్తని హేరంబు గొలువ జ్ఞేయము దంతీ/

16.