అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

11, అక్టోబర్ 2018, గురువారం

దుర్గా దశావతార కందాలంకృతి

- :దుర్గా దశావతార కందాలంకృతి:-

కం//  1.       💐 కనకదుర్గమ్మ 💐 :-.              దుర్గా దేవిని గొలువగ
దుర్గా నవరాత్రి, కనకదుర్గాంబికతో
దుర్గాలంకారములవి
వర్గోత్తమ పాడ్యమితిథితొ-వరుసగ జరుగున్

        2.   💐 త్రిపుర సుందరి💐 :-
బాలా త్రిపురగ సుందరి
మేలై విదియకు విదితమె- మేనిసొగసులతో       చాలా ఏభై యొక్కటి.                       ఆలంకారముల వెల్గు యచ్చెరువొందన్.

         3   💐  గాయత్రి 💐

  ధ్యేయము నీవై  తృతియను
   కాయము మరణించువరకు గాయత్ర్యంబన్
   సాయమనియమాధికమై
   ప్రాయపు వెచ్చింపు రచన ప్రాపంచికమౌ
4.                  💐 అన్నపూర్ణ💐

    వన్నెల చిన్ని తయారుగ
    తన్నామము యన్నపూర్ణ తపమది లేకే
    అన్నీయష్టా దశములు
    నిన్నే చిత్రింప చవితి నిర్ణయ మగులే.

5.                    💐 లలిత💐

    పంచమి నాడే మంచిగ
    సంచిత కర్మముల , లలిత సంతులితాత్మన్
    గాంచిన "కాంచెన రూపిణి
    సంచారములగు" సదసద్గృహములలో.
6.              💐  మహాలక్ష్మి 💐

   మెచ్చెడి తనువిభవముతో
   లచ్చికి షష్ఠ్యాది నుండి లావణ్యముగా
   విచ్చేయు రూప మేష్యము
   నిచ్చెలు నీనామజపము నిర్మమ హంత్రీ.

                      💐  సరస్వతి💐
7.
   సప్తమి మూలము పూజకు
   ఆప్తముగా దోచుచుండు నందరి మదిలో
   క్షిప్త సరస్వతి రూపము
   గుప్త ముగా నినుదలంప గూఢము దెలియున్

8.                  💐   దుర్గ    💐

  దుర్గా దుర్గా యనుచును
  దుర్గమ సంసార సరళి - దుర్గాష్టమితో
  దుర్గను భజించు భక్తుని
  దుర్గ యె రక్షించు చుండు దుఃఖము ద్రోచున్

9           💐  మహిషాసుర మర్దిని  💐  మాహర్నవమికి రూపము.                       ఆహుతమై మహిష చండ ఆవిర్భవమౌ.     ఓహోదేవీ స్తుతమతి
హాహా కారముల శాంత -అమితాగమితా.

10.             💐శ్రీ రాజరాజేశ్వరి 💐

ఆరాధింపగశక్తని.                                                 శ్రీ రాజేశ్వరి యనంగ శ్రీ మాతంగీ.         తారాపథముల జేరిక
వీరమె ,సాధనముజొప్పు విజ్ఞానం బే.