అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

11, అక్టోబర్ 2016, మంగళవారం

దుర్గ సీసజము

సీ॥
ఆయమ్మ దయలతో ఆరంభమైనట్టి
          పద్యమౌ గద్యమౌ హృద్య మంబు
గీర్వాణ శార్వాణి కేలునుంబట్టగా
               అక్షర క్రమములందాడుకొనమె
యక్షీణ లక్ష్మిగా యామమౌ భామినిన్
              సంపాద సామ్రాజ్ఞి సాహితముగ
మంగళ ప్రదమైన మాన్యాభిమానమై
               మానవోద్రేకతన్ మసలుచుండ

సత్కవిత్వపు భాషణా సారసంబు
మహిత మాన్యత దేదీప్యమాన మగుచు
మనము వికసించు మాధురీ మలయజముగ
దుర్గ మాయమ్మ యీవుత దూరదృష్టి

నా భార్య కోరికపై ఆశువుగా చెప్పన సీస పద్యమిది.

అంబ దయ ఉంటే పద్యమైన గద్యమైన హృద్యమంగా వస్తుంది అమ్మవారి చేయి పట్టుకుంటే అక్షరాలతో ఆడుకోవచ్చు. సాహిత్య సంపద క్షీరసాగర కన్యగా (లక్ష్మీ ) లభ్యమవుతుంది. మంగళగౌరి కవితా ప్రేరేపితమై మాన మానవ గౌరవాన్ని అందిస్తుంది ఇది కవిత్వ భాషణ. దేదీప్య భూషణ మనోవికాసానికి  మలయ మారుతం. దుర్గాదేవి అట్టి దృష్టిని కలుగ జేయును (ముగ్గురమ్మల ప్రశక్తి తో ఇది సీస పద్య తాత్పర్యము )

10, అక్టోబర్ 2016, సోమవారం

దంతి కందళి

 

దంతి కందళి

1.     కం//    మృత్తిక మూర్తిని `గణపతి`
  
నెత్తుగ నీవిగ్ర హంబు లేర్పడ భువిలో
  
నిత్తెము భద్ర నిమజ్జన
  
ఉత్తరు పాశన స్మరింప ధన్యత  దంతీ

 

2.     కం//  సత్తువ నిచ్చెడి ' గణపతి'
   
విత్తము బొత్తము మరేమి వివిధా గమముల్
   
ఎత్త రి నైనను బొందగ
   
తత్తర పాటేల ? నిన్ను  దలచిన దంతీ

 

3.     కం// అత్తరి కైలా సములో
   
సత్తె మవిఘ్నము కుమార సామిని గెలువన్
   
ఉత్తమ ధీగురు ముల్లో
   
కోత్తము డనరా  ! ప్రసిధ్ధ  కోవిద దంతీ

 

4.     కం//  ఉత్తర దిక్కున వెదుకగ
   
నుత్తారించిన ముఖమును నుద్యమ గతితో
   
అత్తించిన హస్తీశా
   
వేత్తా, తాతా విధాత విశృత దంతీ

 

5.     కం//   దుత్తాకాశ మదెంతయొ
  
చిత్తైకోధృతి హసింప శీతుని వగతో
  
భిత్తిం శపింప కథలై
  
మిత్తికి మింటికిని గలిగె మీదయ దంతీ

 

6.     కం//     పొత్తము వ్రాయగ కలమై
  
ముత్తెపు మునిపంటి సగము మూర్తంబయ్యెన్
  
లత్తు వినాయక భారత

            సత్తాలేఖన సువేద శాస్త్రిగదంతీ

 

7.     కం//  మత్తేభంబును జూచిన
   
చిత్తములో జిత్రమైన  శ్రీగణనాథా
   
తత్తేజంబును గొలిచిన
   
ఉత్తమ గతులెల్లగల్గు నుర్విని దంతీ

 

8.     కం//  ఎత్తుకు గుజ్జగు రూపము
      
కుత్తుక నతికిన గజముఖ కోమల నయనా
      
ఇత్తెరగు చెవులు చాటలు    
      
చిత్తరువేయగను జూడ చిత్రము దంతీ

 

9.     కం//  హత్తుకునానుకు నుండును
     
బొత్తిగ చిన మూషికంబు  బ్రోచిన దొరనే
     
సత్తువ మోయగ దగునో
     
విత్తుకు పెను వృక్షభరము వింతగు దంతీ

 

10.                        కం//  చిత్తడి ధారలు గురియగ
     
పుత్తడి పండంగ నిండె పుడమిని వడిగా
     
విత్తిన భాద్రపదపు మా
     
సాత్తుగ లంబోదర వర సాక్షీ దంతీ

 

11.                        కం//  మొత్తము ఇరువది యొకటిగ
   
దత్తసమర్పణ విధాన దయ సేయగదే
   
దత్తూర పత్ర గరికలు
   
సొత్తుగ గైకొని శుభముగ జూడుము దంతీ

19, జూన్ 2016, ఆదివారం

ప్రస్తుతాంజలి - డా|| చంద్రశేఖర్Welcome Address – స్వాగత సుమాంజలి
   ఎందరో మహానుభావులు... అందరినీ ఒక్కటి చేసిన – ఈ రోజు – సుందర సుమనోహర సంబోధనల భావింపగా ఇదే మా స్వాగత సుమాంజలి.
            ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అధిపతి గా మన చంద్ర శేఖర్ గారు అందరికి సుపరిచితులు, ఆరోగ్యానంద సంధాయిగా – హాయిగా నేటి సత్యారమునకు విచ్చేసిన వారికి – వారిని అభినందింపగా వచ్చిన మీ అందరికీ సుమనస్సుల నమస్సులు.
            ముందుగా వారి సత్కారానికి పొందుగా – కనువిందుగా – వైద్యమిత్ర బృందములందరీకీ పేరు పేరునా మా స్వాగత సుమాంజలి
        అట్టి వారిలో అందరిలో కొందరిని వెల్కమ్ అడ్రస్ గా సంభాషించగా తొలిదొల్తగా నేటి సన్మాన గ్రహిత శ్రీమతి ఽ శ్రీ చంద్ర శేఖర్ దంపతులకు మా అభినందన మందారమాల
ద్వితీయులైన  అద్వితీయమైన మన ఆరోగ్య శ్రీ కార్య నిర్వహణాధికారిణి శ్రీమతి ఉష గారికి సుస్వాగతం.
తదనంతర ప్రభృతులు
                  డా|| గోవర్ధన్ రెడ్డి (Executive officer & chief medical auditor) గారికి సాదర ఆహ్వానం.
అదే విధంగా …………..
   సర్వశ్రీ   డా|| గోపాల కృష్ణ గారు (Executive officer for operations ) గారికి సాదర ఆహ్వానం
                 డా|| రాజేంద్ర గారు (JEO implementation ) గారికి సాదర ఆహ్వానం
                 డా|| బాల కోటయ్య ( General Manager ) గారికి సాదర ఆహ్వానం
మరియు అందరి డెందము కందళింప సుహృజ్జన శోభిత వైద్యబృంద JEO’s & Dept. Executive officers, All dist. Coordinative Telangana & all Dist.  Managers  - Team Leaders, Arogyasri Trust – Mitras – Foss – Executives
అందరికీ స్వాగతం పలుకుతూ నేటి సన్మాన గ్రహీతైన డా|| చంద్రశేఖరుని వైఖరిని ప్రస్తుతింప ఉపన్యాసకులు తమ ఆలోచనా విన్యాసములను గావింపవలసిందిగా – కోరుకుంటున్నాము.
-      ఇట్లు
 మీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్

Speech of Dr. Anil Kumar
                   
                        Distinguished delegates of the day, and Remarkable persons and esteemed all other invites of Today I will take a privilege to express my views about Sri M.ChandraSheker  Garu(CEO of the Aarogyasri HealthCare Trust, Govt. Of Telangana.) He served many people and gets more Reputation throughout his life. So many people take rest after retirement, But our hon’ble CEO is not in a mood,  But his mode of culture is always to serve the public. He comes from a respectable family of IAS cadre , and his esteem as follows as renown.
Please observe his name ChandraSheker
                  తెలుగు భాషలో చెప్పాలంటే చంద్రశేఖరుడంటే ఈశ్వరుడు. బ్రహ్మవిష్ణుమహేశ్వరులలో
అదే క్రమంలో సత్వరజో తమోగుణములు ఉంటాయి. తమోగుణము మత్తును కల్పించే లక్షణ సమన్వయము. ఎనస్తాలజిష్ట్ గా శారీరక భాదలు తెలియకుండా రోగికి అవసరమైన మోతాదులో తమోగుణాన్ని కలిగించి మనమందరం ఆపరేషన్సు చేస్తాం. మరోమాటలో చెప్పాలంటే ఎనస్తీషియా ఇవ్వకుండా అపరేషన్ నిర్వహించలేము. కాబట్టి వైద్యుడు నారాయణుడని హరి అని కీర్తింపబడినప్పటికి, శివుని అఙ్ఞా అంశ లేని వాడు ఎనస్తాలజిష్ట్ కాలేడు. చంద్రశేఖరునిలో ఆ హరిహరాద్వైతము కనిపిస్తుంది.
                      Of course I am not a philosopher to enlarge the content above said. It is taken by opinion of a  Pandit. As according to his feelings the name of a person very suitable. In other words the name “Visalashi” is not appropriate if she having one (Small eye’s) eye. But  ChandraSheker is a big name of our worshiping god “Eswara”  
          బిషజే సర్వరోగిణాం – దక్షిణామూర్తి ఉపనిషత్తును అనుసరించి భవ రోగములను కుదర్చగల శక్తి ఈశ్వరునిదే. అనగా చంద్రశేఖరుడుదే. దక్షిణామూర్తి గురువులకు గురువు.
  I think our Chandrasheker is not only a Guru but also a preacher. I don’t wish to prolong my speech Because I am not at all elder than of you. But my enthusiasm makes me to deliver the few words.
      A word can dictate the whole world But the Adhipati is Shiva or Narayana whatever the name may be like our beloved Guru Dr. M. Chandrasheker       
thank you one and all, to give this opportunity and I may thank full and grate full to Faliscater of today’s  auspicious celebrity and more and more ……. CEO Chandrasheker Garu

Namaste.

Vote of thanks:
contact for సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు
9966455872
                                                                          ------------    పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రి )
                                                                                                   గ్రేడ్ వన్ తెలుగు పండిట్

7, ఏప్రిల్ 2016, గురువారం

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం - రాశి ఫలితాలు

https://www.scribd.com/doc/307190210/Sri-Durmukhi-Nama-Samvastara-Ugadi-2016-2017-Telugu-Rasi-Phalalu-Yearly 
https://issuu.com/parakri/docs/sri_durmukhi_nama_samvastara_-_2016
https://archive.org/details/SRIDURMUKHINAMASAMVASTARA20162017TeluguRasiPhalaluYearly 
http://www.slideshare.net/parakrijaya/sri-durmukhi-nama-samvastara-20162017telugurasiphalaluyearly
తెలుగు వారంరికీ  శ్రీ దుర్ముఖి నా సంత్స శుభాకాంక్షలు
 శ్రీ దుర్ముఖి నామ సంవత్సరము ఉగాది వేడుకలు 
Sri Durmukhi Nama Samvastara Ugadi 2016-2017 Telugu Rasi Phalalu Yearly
Durmukhi nama samvatsaram -rasi phalalu 2016 to 2017 Telugu4, ఏప్రిల్ 2016, సోమవారం

పదమథనము

🎯🎯పదమథనం 🎯🎯

నాలుగు అక్షరాలు పదం

1,2.   అంగజ.  ఆత్మజ .పుత్రిక

1,3,ల,4     ఒక అధోలోకము .

       సప్తలోకములలో ఒకటి.

1,మ,4    పుష్పము. లతాంగము.

2,3,4   సుభోదము. మేలు

2,మ,4      శిశిరము. నిహారము.
                 తుషారము.

3,మ,4  తిమిరము .అంధకారము

3,3,4.   పట్టు . పంతము.
                  వికటము.

పదమును తెలపండి.

పదమథనము

🎯🎯పదమథనం 🎯🎯

ఆరు అక్షరాలు పదం

2,3 - స్వప్నము, భాగము

4,5 - నైపుణ్యం,చతురత

1,3,1,౩ -  ద్రవం బాగా మరుగుట అనే అర్ధం

1,4,3 - పూర్తిగా, మొత్తం

పా,6 - వశం,క్షీరము

2=4

పదమును తెలపండి.

పదమథనము

🎯🎯పదమథనం🎯🎯

ఐదు అక్షరాలు పదం.

1,థ.    దుఃఖము. ఆక్రోశము.

2,4.   ధర . ధరణము.

1, య,5    ఖర్చు.క్షయము.    
                   వెచ్చము.

2,4,5      శ్రేష్ఠము. కోరిక.

2,న ,4   మేఘజము .వరుణము .
                      కాన .

3,2,5.  లలంతిక .గొలుసు.

శ,4,1,5  లక్ష్యము. గుఱి . .

పదమును తెలపండి..

3, ఏప్రిల్ 2016, ఆదివారం

పదమథనము


🎯🎯పదమథనము🎯🎯

నాలుగు అక్షరాలు పదం

1,3,1,3. ధ్వన్యనుకరణము.

2,3  ఆగమనము ..  రాకడ.

1,2, య,ణ,4 ...
                 ఆశ్రయము.ఠికాణా..

2,వ ,4       ధ్వని . గర్జితము.

3, ర ,4      కే‌లు . హస్తము.

తో 3,4     సంతానము. పరంపర.

చ‌,ట,3,4.   ఊరపిచ్చుక.
                    కలవింకము.

పదమును తెలపండి ..

🎯🎯పదమథనం🎯🎯 ౨

నాలుగు అక్షరాలు పదం

1,2   దేవతలు.  వాతూలము.

1,త.  కుమార్తె .. తనయ ..

1,3,4   కొడుకు ..కుమారుడు

1,2. భి   భూమి. సారంగము.

చ. 3,4  కృష్ణ సారము. చలనము.

నాపి3,4  ..దేశచ్చిదుడు.
                    క్షౌరికుడు.

పదమును తెలపండి ..
🎯🎯పదమథనము🎯🎯  ౧

నాలుగు అక్షరాలు పదం

1,2,4   ముదము .రాధనము.

1,4.   ముఖము.. ఆననము.

3,2,4.   నది .పర్వతజ .

4,2,3,4   కపటభావము.
                కుచ్చితము.

1, స,4    అపహరణము.
                 వంచనము.

మౌ,3,4.    అవాక్కు.
                అభాషనము.

పదమును తెలపండి..

29, మార్చి 2016, మంగళవారం

పదమథనం

🎯🎯పదమథనం🎯🎯 ౨

నాలుగు అక్షరాలు పదం

1,2   దేవతలు.  వాతూలము.

1,త.  కుమార్తె .. తనయ ..

1,3,4   కొడుకు ..కుమారుడు

1,2. భి   భూమి. సారంగము.

చ. 3,4  కృష్ణ సారము. చలనము.

నాపి3,4  ..దేశచ్చిదుడు.
                    క్షౌరికుడు.

పదమును తెలపండి ..

27, మార్చి 2016, ఆదివారం

సమస్యా పూరణ....నగ్రజానుజు లైరను జాగ్ర జులుగ

సమస్యా పూరణ :     

ఆదిశేషుండు అవతారమందు తరలి
రాము గొలువంగ తమ్ముడై ‌లక్ష్మణుండు
ఆశ తీ‌ర్పంగ బలరాముడన్న గాగ
అగ్రజానుజులైరనుజాగ్రజులుగ.....జయ

రాము డన్నగ లక్ష్మణ స్వామి గొలిచె
కృష్ణు  డగ్రజు బలరాము తృష్ణ  దీర్చె
పృధ్వి నలరార జూడమె ఋజువు గాను
నగ్రజానుజు లైరను జాగ్ర జులుగ

ముందు కులముల మనువారు ముందు ముందు
వెనక కులముల నెడివారి వెనుక బడగ
హిందు దేశసౌ భ్రాతృత్వ సింధు వందు
నగ్రజానుజు లైరను జాగ్ర జులుగ.....పరాక్రి

25, మార్చి 2016, శుక్రవారం

దుర్ముఖీ

ఉ||  వ్రాసిన మాట తెల్గుకవి వ్రాతల నూతన భావపుంజముల్
జూసిన జూపు అచ్చెరువు చూతప్రపూతప్రభాత గీతికల్
ఆశువుగా మదర్పితము అందరి డెందము గందళింపుగా
భాసిత దుర్ముఖీ భువన
వత్సర శోభలు మెండుగావుతన్

జవాబు చెప్పండి

ఏడు అక్షరాల పదము ఎడమమొదలు
మొదటి రెండక్ష రాలును
ముదిత దెలుపు
ముదిత గట్టు బట్టనుదెల్పు
మూడు నాల్గు
అక్షరాలాఖరివి మూడు
పక్షి దెలుపు.............?

జవాబు చెప్పండి

ఆమె అందాల రాశిగా
అవని ఎరుగు
ముందు మృగరాజు వెనుకటి
మూర్తి త్రాసు
గగన కుసుమమై దనరారు
కాంత గాదు
పెండ్లి సేయుట మీకున్న పెద్ద ప్రశ్న.

24, మార్చి 2016, గురువారం

అష్టావక్రుడు

అష్టావక్రుడు ( ఈ  కధ  ప్రతిఒక్కరు  చదవండి )

పాండవులు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఒకనాడు ఉద్దాలక మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. లోమశుడు ఆ మహర్షికి సంబంధించిన ఒక కథను ధర్మరాజుకు చెప్పాడు.

వేదాంతం ఉపదేశించగల పెద్దలలో గట్టివాడు ఉద్దాలకుడు. ఆయన వద్ద కహోలుడనే శిష్యుడుండేవాడు. అతను చాలా బుద్ధిమంతుడు. మంచి గుణగణాలు, నీతినియమాలు కలిగినవాడు. కాని అతని దగ్గర ఒకే ఒక లోపం వుంది. అదేమిటంటే నిలకడ లేదు మనిషిదగ్గర. అందుకని ఏ విద్యా పూర్తిగా నేర్చుకోలేకపోయాడు.

అయినప్పటికీ ఉద్దాలకుడికి కహోలుడి పట్ల ప్రేమ వుండేది. అందుకని తన కూతురు సుజాతనిచ్చి పెళ్ళి చేశాడు.
కహోలుడికీ, సుజాతకూ ఒక కొడుకు కలిగాడు. తల్లి కడుపులో వున్నప్పుడే తాత చదివే వేదాలన్నీ విని నేర్చుకున్నాడు. కాని, తండ్రి కహోలుడు వేదాధ్యయనం చేసేటప్పుడు తప్పులు దొర్లేవి. ఆ అపశబ్దాలు వినలేక ఆ పిల్లవాడు తల్లి గర్భంలోనే వంకరలు వంకరలుగా ముడుచుకుపోయేవాడు. ఆ వంకరలు చివరకు అతని శరీరంలో అలాగే నిలిచిపోయాయి. అలా ఎనిమిది వంకర్లతో పుట్టడంవల్ల అతనికి అష్టావక్రుడని పేరు వచ్చింది.

అష్టావక్రుడు చిన్నతనంలోనే గొప్ప విద్వాంసుడైనాడు. పన్నెండేళ్ళు వచ్చేసరికి వేద వేదాంగాలన్నీ చదువుకున్నాడు. ఒకసారి జనకమహారాజు మిథిలా నగరంలో పెద్దయాగం చేస్తున్నాడని తెలిసింది. తన బంధువూ, మిత్రుడూ అయిన సువేదకేతువును వెంటపెట్టుకొని అష్టావక్రుడు మిథిలకు వెళ్ళాడు. అక్కడ రాజభటులు వాళ్ళిద్దర్నీ లోపలకు పోనీయలేదు. అప్పుడు అష్టావక్రుడు రాజభటులతో " నాయనలారా! గుడ్డివాళ్ళకు,కుంటివాళ్లకు, స్త్రీలకు మహారాజే తప్పుకుని దారి ఇవ్వాలి. వేదాలు,ఉపనిషత్తులూ చదువుకున్న విద్వాంసులూ, పెద్దలూ దారిన పోతుంటే - రాజైనా సరే - వారిని పక్కకు తొలగిపొమ్మనకూడదు. ఇది నేను చెబుతోంది కాదు, శాస్త్రం చెబుతోంది" అన్నాడు.
ఈ వాదం రాజుగారి చెవికి చేరింది.

ఆ పిల్లవాడి తెలివితేటలకు ఆనందపడి 'నిజమే! ఆ బాలకుడు చెప్పినదాంట్లో అబద్ధమేమీ లేదు. నిప్పుకి మన తన భేదం లేదు. కాలుతుంది,కాలుస్తుంది. పిల్లవాడు చిన్నవాడైనా ఉద్ధండుడిలా వున్నాడు' అనుకొని, " ఆ బాలకులిద్దర్నీ వెంటనే లోపలికి పంపండి" అని భటుల్ని ఆదేశించాడు.

ఆజ్ఞ ప్రకారం అష్టావక్రుడ్నీ సువేదకేతువునీ లోపలికి పంపారు.
కానీ, మరోచోట ఇంకో ద్వారపాలకుడు అడ్డగించాడు. "ఇక్కడికి మీబోటి చిన్నపిల్లలు రాకూడదు. వేదం చదివిన పెద్దలు మాత్రమే రావాలి" అన్నాడు.
"మేం చిన్నపిల్లలం కాము. వేదాలు అధ్యయనం చేసాం. అయినా పైపై మెరుగులు చూసి, ఆకారం చూసి, వయస్సు చూసి ఎవర్నీ పెద్ద, చిన్న అని అంచనా వెయ్యకూడదు. ఆకారాన్ని బట్టి పాండిత్యం రాదు. వయస్సు వచ్చినంత మాత్రాన వృద్ధులు గారు - జ్ఞానం చేత పండినవారే వృద్ధులు. తెలివి వున్నవాడే మనిషి" అని సుదీర్ఘంగా ప్రవచించాడు అష్టావక్రుడు.

ఇలా వాదన జరుగుతున్న సమయంలో రాజుగారు అక్కడకు వచ్చి, "మా పండితులందరూ మహా విద్వాంసులు. అటువంటి వాళ్ళతో వాదించాలనే కోరిక నీకెందుకు కలిగిందో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ నువ్వు ఆ వాదంలో ఓడిపోతే వాళ్ళు నిన్ను సముద్రంలోకి తోస్తారు. అందుకు సిద్ధమేనా?" అని అడిగాడు.

"మహారాజా! మీరు చెప్పినట్లే కానివ్వండి. కాని వాళ్లు నాతో వాదించలేరు. ఆ సంగతి నాకు తెలుసు. పండితులమనీ, అన్నీ తెలిసినవాళ్ళమని అహంభావంతో వున్నారు వాళ్ళు. వాళ్ళు చేసిన అవమానం వల్లే మా తండ్రి సముద్రంలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు మా అమ్మ చెప్పింది. అందుకని పట్టుదలతో వచ్చాను.

మీపండితుల్ని ఎదిరించి వాదించగలను. లేకపోతే నేను కూడా సముద్రంలోకి దూకుతాను. ముందు నన్ను లోపలికి రానీయండి" అని కోరాడు అష్టావక్రుడు.
అందుకు జనక మహారాజు ఒప్పుకున్నాడు. అష్టావక్రుడి ప్రశ్నలకు ఎవరూ సరిగా సమాధానం చెప్పలేకపోయారు.

అష్టావక్రుడు గెలిచినట్టు ప్రకటించారు. పందెం ప్రకారం వాదంలో ఓడిపోయిన వాళ్ళందరూ సముద్రంలో దూకారు. తన ప్రతిభాపాండిత్యాలతో తండ్రి కహోలుడికి ఆత్మశాంతి కలిగించాడని అష్టావక్రుణ్ణి లోకం కొనియాడింది.

అదీ కథ.

కనుక చదువు సంధ్యలు లేని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు స్వయంకృషితో,

పెద్దల ప్రోత్సాహంతో మేధావులుగా రూపొందవచ్చు.

పండితుడి కడుపున పరమ శుంఠ జన్మించవచ్చు.

దేహబలం లేని తండ్రికి బలాఢ్యులైన పిల్లలు పుట్టవచ్చు

. కేవలం అనువంశిక లక్షణాల్ని బట్టి, పైపై ఆకారాలను బట్టి ఎవర్నీ అంచనా

వెయ్యకూడదు.