అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

11, అక్టోబర్ 2018, గురువారం

దుర్గా దశావతార కందాలంకృతి


దుర్గా దశావతార కందాలంకృతి  :-


కం//   దసరాదశమిది పండగ

దశవిధ మాతలనుగూర్చి దర్శింపంగా

అసలుసిసల్ నవరాత్రులు

దశమికి దేవతల యనుపు ! దసరాయనగా

 

1.  పాడ్యమి బాల :-

కం//    బాలా త్రిపురపు సుందరి

మేలై పాఢ్యమి మొదలుత మెరయును భువిలో

చాలా నవరూపంబులు

నాలంకారముల వెలుగునారింభముతోన్

 

2.  విదియ గాయత్రి:-
       కం//   ధ్యేయము నీవై  విదియకు

కాయము ఉన్నంతవరకు గాయిత్ర్యంబన్

బాయక జపనియమముతో

భూయో భూర్భువ యగణిత భువనా గవనా

 

3  తదియ అన్నపూర్ణ :-
      కం//    ఆహార్యంబులు నిచ్చెడి

మాహాత్యము నన్నపూర్ణ మాతకు తదియన్

స్వాహా కారముల మెలగి

ఓహో నర్చింతుమమ్మ ఓనమ నమితా

4.  చవితి శాకంబరీ     :-

కం//    చవితికి రూపము నీవని

భవితకు  శాకంబరియని భావింపంగా

నవకవితత్మాక దేవీ

భువి నర్చింతుమిపుడు నిన్ను భువనేశ్వరిగా

 

5. పంచమి లలిత:-

కం//    పంచమి నాడే మంచిగ
               సంచిత కర్మముల , లలిత సంతులితాత్మన్
               గాంచిన కాంచెన రూపిణి

యెంచుమ ఆగామిలబ్ధ యెలమిన్ గలిమిన్

 

6. షష్ఠి మహాలక్ష్మి :-

కం//     మెచ్చెడి తనువిభవముతో
              లచ్చికి షష్ఠ్యాది నుండి లావణ్యముగా
              విచ్చేయు రూపమనంతము
              నిచ్చెము నీనామజపము నిజమది గమలా


7.  సప్తమి  సరస్వతి:-
      కం//    సప్తమి మూలము పూజకు
              ఆప్తముగా దోచుచుండు నందరి మదిలో
              క్షిప్త సరస్వతి రూపము
              గుప్త ముగా నినుదలంప గూఢము దెలియున్

 

8. అష్టమ దుర్గ    :-

కం//     దుర్గా దుర్గా యనుచును
              దుర్గమ సంసారి యెపుడు - దుర్గాష్టమితో
              దుర్గను భజియించు నెపుడు
              దుర్గ యె కాపాడు మనుజు దురితము బ్రోచున్

 

9. నవమి  మహిషాసుర మర్దిని  :-

కం//    మాహర్నవమికి రూపము.

ఆహుతమై మహిష చండ ఆవిర్భవమౌ.

ఓహోదేవీ స్తుతమతి 
             హాహా కారముల శాంతి నందగ గనుమా

 

10.  దశమి శ్రీ రాజరాజేశ్వరి :-

కం//    ఆరాధింపగశక్తిని.

శ్రీ రాజేశ్వరి దశదిస చిన్మయదేవిన్

కోరిన వరముల నొసగగ

తారాపథమందజేర్చు తత్ప్రాభవమై