అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

27, జూన్ 2012, బుధవారం

క్రీస్తు కీర్తి


                          క్రీస్తు కీర్తి 


              




      (1-1-1991 నాడు క్రైస్తవ మిత్రులను అభినందిస్తూ వ్రాసిన ఖండిక)
 
   1. ఉ||   ఏసుని  దివ్య  బోధలవి  బైబిలు  గ్రంథ సువార్త యుక్తమై
               శాసన  ధర్మ  కర్మ  యనుశాసిక-శుద్ధపరాత్మ-దైవమా
               వాసము చర్చియందు పరిభాషల నూతన వత్సరంబునన్
               భాసిత దేవ-హే-ప్రభువ భావితరాలను బ్రోవుమియ్యడన్ ||
 

  2. ఉ||  దేవుని బిడ్డలన్ కరుణ దీరున కావలి గాయు వానిగా
             సేవల దప్పిగొన్న నిజసేవకు నార్తిని బాపు-యెహోవ-నీ
             భావనలో మదీయ తను భారము పాపపు చేతలన్నియున్
             గావుమ రక్షకుండవయి ‘కారణ జన్ముడ-మేరి పుత్రుడా’ ||

3.ఉ||    ఎవ్వని చేత యూదులకు నేర్పడె తియ్యని ప్రేమతత్వమున్
            ఎవ్వని దివ్య నామమది యేలె ప్రపంచము నంత భవ్యమై
            ఎవ్వని బోధనామౄతము ఎంచగ సత్యమొ నిత్య కౄత్యమో
            ఇవ్వని చర్చిలో గనుడు ఏసుని భక్తి ప్రపత్తి మీరగా ||