అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
పరాక్రి పద్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పరాక్రి పద్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జనవరి 2020, బుధవారం

సన్మాన స్నేహ సుమాంజలి

పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా. . సన్మాన స్నేహ సుమాంజలి




contact for సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు
9966455872, 7013390324
                                                 ------------    పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రి )
                                                                     గ్రేడ్ వన్ తెలుగు పండిట్  ( ఉపాధ్యాయులు)                                                                                                  శొంఠ్యాం , విశాఖపట్నం.

18, మార్చి 2018, ఆదివారం

విలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

విలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు,...
 సర్వదేవతలు శుభములను అనుగ్రహించాలి అని ఆకాంక్షిస్తూ.........

New Ugadi Wishes 2018|Vilambi Ugadi | Ugadi Shubhakanshalu|



16, సెప్టెంబర్ 2017, శనివారం

మనోజ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు - సన్మాన సుమాంజలి

మనోజ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు  - #సన్మానపత్రాలు

తేది. 17-09-2017 నాడు ఉదయం 10 గం|| నుండి 12.30 గం|| వరకు మనోజ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ( విశ్వోదయ పాఠశాల ఆవరణలో ) వారి ప్రోత్సహంతో  శ్రీ గజ్జెల హనుమాండ్ల చారి గారిని, శ్రీ కె.కళాధర్ గారిని, నాట్యాచార్యులు శ్రీ టంగుటూరి భీమన్ పటేల్ గారిని అందించిన సన్మాన సుమాంజలి

శ్రీ గజ్జెల హనుమాండ్ల చారి - అనల్ప శిల్ప గరియసి

 శ్రీ కె.కళాధర్ - నటనా గరియసి

నాట్యాచార్యులు శ్రీ టంగుటూరి భీమన్ పటేల్ - నాట్య గరియసి

--సమర్పణ --
మనోజ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు
విశ్వోదయ పాఠశాల


contact for సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు
9966455872, 7013390324
                                                                          ------------    పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రి )
                                                                                                   గ్రేడ్ వన్ తెలుగు పండిట్



21, మార్చి 2015, శనివారం

మన్మధ ఉగాది శుభాకాంక్షలు








ఆకాంక్ష

కం||             వచ్చెను మన్మధ వర్షము
                   తెచ్చును సుఖ శాంతులిలను దీర్చును బాధల్
                   విచ్చిన ఆశల మనమున
                   ముచ్చట జనులంత వడిగ ముందడు గేయన్|| 
                                                        -------- జయ మహేశ్వరి


-: సందేశం :-

ఉ||        మన్మధ వత్సరం బనగ మంచిని చెడ్డను యెంచి జూచుటే
             మన్మధనంబు జేసు కొని మారుట మార్చుట ముఖ్యమౌ గదా!
             తన్మహి తాత్మ సంగతుల దారులు, తీరులు, దూరుభావనల్
             చిన్మహనీయ శోధనల శీఘ్రమె మాను(వ)మ మానవావహా ||
                                                                   ---------      పరాక్రి




17, ఫిబ్రవరి 2015, మంగళవారం

మిత్రులందరీకి మహా శివరాత్రి శుభాకాంక్షలు




మిత్రులందరీకి మహా శివరాత్రి శుభాకాంక్షలు
శివుని పేరు మీద చిద్విలాసము లొప్ప
ఈప్సి తార్థ వర్త ఈ స్వరమున
జాగరంబు సేయు జనములు జగమున
అప్రమేయ వరద హరి ముకుంద ||
--- పరాక్రిజయ

See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872
Like the face book page : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAY…,

5, ఫిబ్రవరి 2014, బుధవారం

సమైక్యాంధ్ర లో శ్రీ మదాంధ్ర భాగోతం

సమైక్యాంధ్ర  శ్రీ మదాంధ్ర భాగోతం
part 1 Dt. Sep 27, 2013 

part 2  (NEW) Dt. 04/02/2014 

 పోతన వ్రాతగాదె తలపోతల కూతల చేతనంబుతో
నీత సమైక్య రాగ ముదయించెను భావితరాల కోశమై
నూతన శీర్షికా ప్ర కట నుద్యమ భాషల భేష జంబుతో
జూతురు సమైక్యమన్న జన జృంభిత గుంభిత భావజాలమున్ //

రాజరికము పోయె రాజ్యంబు గలదేని
ప్రజల సామ్యమొచ్చె ప్రభుత కొరకు
రాజకీయమందు రాక్షస క్రీడలా 
నాడు పాడిగాదు నేడు నదియె //

తంత్రమేది గాని తాదాత్మ్యమొక్కటే
స్వేచ్ఛలేని నాడు కుచ్ఛితంబు
తుచ్ఛమైన దాని తూతూల మంత్రాన 
సాగమింతునేమి బాగుగలదె //

మూడు ముక్కలాట ముచ్చట గొల్పుచో
ఆటగానె జూతురాంధ్రులెపుడు
పాటు గల్గునాడు పాల్గొనకుందురా
తాట నిలపగలరు తపన నొడమి //

ఉన్నది ఉన్నది గానొప్పు 
కన్నుగవంటేనె రెండు గానుటకొప్పున్
తిన్నగ జూడని పక్షము 
అన్నన్నా వెతల గోడు హస్తినకొచ్చెన్  (?) //

ముచ్చటింపుగాదు ముచ్చెమటలు బట్టు
మూర్ఖ యోచనంబు మూర్కొనంగ
అచ్చతెనుగు నేల నిచ్చకంబులదేల
సాధ్యపడదు మీకు భాద్యులార // 
__________________________________________________

సమైక్యాంధ్ర  శ్రీ మదాంధ్ర భాగోతం part 2
Dt. 04/02/2014 

హస్తిన మస్తకాప్రబల హస్తపు, చేతల ఢుల్ల దెెల్లమౌ
ఆస్తుల పంపకాన సరియానదు, సుప్తనిరస్త స్వస్థతల్
దోస్తులు మెచ్చబోరు, భరతోర్విని గర్విత భావజాలముల్
ప్రస్తుత శ్రీమదాంధ్ర విభప్రాభవ భంజన సాధ్యమేరికిన్ ||

యుద్ధ ప్రాతిపథికను సం సిద్ధమైన
హైదరాబాదను జిహాదు పాదుకొనును
కొత్తరాష్ట్రమ్ము యేరికి గోరికయ్య
నిక్కమెన్నిక ! కలలన్ని  నిజముగావు ||

అంతరాయ మొచ్చి ఆగిపోవును గాత !
తెలుగు నేల జిచ్చు దెప్పరిల్ల
స్వచ్ఛమైన దాని యిచ్ఛలు నేరవేర
ఆంధ్ర వాణి పటిమ యగును నిజము ||  


22, అక్టోబర్ 2013, మంగళవారం

విజయ నగరం పైడి తల్లి అమ్మ వారి పండుగ - పైడిమాంబ పంచకం

                              పైడిమాంబ పంచకం
      
                        


       ( విజయనగరం పైడితల్లమ్మవారి దర్శనానంతరం  1984 లో ఈ పరాక్రి పైడిమాంబ పంచకం విరచించడమైనది. ఈ రచనకు ప్రేరణ రావణబ్రహ్మ కృతమైన శివస్తుతి.  )                         

     1. శ్లో  || సుందరాననా మరంద కుందచందనా స్వబంధు గంధసుందరీ
              ఇందిరా ప్రభాప్రసూన ఇంద్రియాణి  మందిరాసురాజ వందితా
              విద్య నాగరీ గరీయశీ విశేష మేదినీ గజేంద్ర నందినీ
              హే పురాధి దేవతా యశస్వినీ సుఖప్రదా సు పైడిమాంబికా ||

       2. శ్లో  || క్షీరసాగరోద్భవాని వాణ్యపర్ణ కంకణా కలాప నిక్వణా
             మత్కవిత్వ చిత్తకామినీ  సచిత్రరాగ రూపిణీ పరాగిణీ
             భుక్తిముక్తిదాయినీ స్వశక్తియుక్తిచారిణీ ప్రసారిణీఘృణీ
             హే పురాధి దేవతా యశస్వినీ సుఖప్రదా సు పైడిమాంబికా ||

  3. శ్లో || 
  సృష్టి పాలకే కపాలికే జ్జ్వలజ్జ్వల ప్రభాల కీల కాళికే
              యోద్ధబుద్ధివర్ధినీ  స్వరాజ్య వౄక్షకాండచారిణీ విహారిణీ
              విశ్వమోహినీ విశేష గాత్రపోషణా విశాలనేత్ర భాసురా
              హే పురాధి దేవతా యశస్వినీ సుఖప్రదా సు పైడిమాంబికా ||

     4.  శ్లో || క్షపాత వర్జితా విలక్షణ ప్రచార చక్షు దుష్టశిక్షకీ
           అక్షర ప్రమోద యక్షిణీ సుశిక్షణా క్షణక్షణ ప్రదక్షిణీ 
           మల్లికామతల్లికా ప్రఫుల్ల పల్లవీ నవీన కీర్తి వల్లకీ
           హే పురాధి దేవతా యశస్వినీ సుఖప్రదా సు పైడిమాంబికా ||

    5. శ్లో || పావనీ నమోనమో  మహద్నిరూఢకాత్మ  శాంతి క్రాంతి  కారణీ
          యోగినీ నమోనమో భవద్గుణాలవాల  హే! మదుక్త మాతృకా
          నూత్న ఛంద వైభవాంగ విక్రగంధి రూపిణీ, " పరాక్రి " పంచికా
          హే పురాధి దేవతా యశస్వినీ సుఖప్రదా సు పైడిమాంబికా ||

           ఇది పరాక్రి విక్రగంధి నూతన ఛందో పంచకం.
కృకృత్యుడనైతే ధన్యుడను.

11, ఏప్రిల్ 2013, గురువారం

విజయ నామ సంవత్సర ఉగాది ఆహ్వానం


స్వాగత మమ్మా విజయ
రాగాల తో కోయిలమ్మ రమ్మని పిలిచే
పొంగెను ఆమని నినుగని
భాగమె కవితా ప్రసన్న భారతిగూడెన్ ||

                    - పంతుల జయ మహేశ్వరి




8, మార్చి 2013, శుక్రవారం

నిర్వచన ధర్మపత్ని

                                           నిర్వచన  ధర్మపత్ని
                                                                             - పరాక్రిజయ


శ్లో||   కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా
      రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, షట్ధర్మ యుక్తా కుల ధర్మపత్నీ ||

                                                         ( స్వేఛ్ఛానువాదం )

     సీ||      సేవలందించు  సంక్షేమ వర్తియై  
                             భావనా స్ఫూర్తితో భవిత  కొ
కు 
              అన్న పూర్ణాంబయై ఆకలి దీర్చుచు
                             రతికామ  రసరాజ్య  రంభయగుచు
              ముగ్ధ మోహన నీదు ముఖవిలాసజూచి
                             రూప లక్ష్మిగ నిన్ను రూఢి గొలుతు
              ఓర్పులో వసుధవై  నేర్పుగా  కూర్మితో
                                  జన్మ సార్ధకతను  చాటినావు

   గీ||        జాతి  జాగృతి పథ సంచార కతన
              గత  చరిత్రలు సాక్షమౌ  గాజులమ్మ
              నీదయా వర్ష సారపు నియమ మిదియె
              ఆరు ధర్మంబులొప్పెడి దాలి యగును