నిర్వచన ధర్మపత్ని
- పరాక్రిజయ
శ్లో|| కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, షట్ధర్మ యుక్తా కుల ధర్మపత్నీ ||
( స్వేఛ్ఛానువాదం )
సీ|| సేవలందించు సంక్షేమ వర్తియై
భావనా స్ఫూర్తితో భవిత కొఱకు
అన్న పూర్ణాంబయై ఆకలి దీర్చుచు
రతికామ రసరాజ్య రంభయగుచు
ముగ్ధ మోహన నీదు ముఖవిలాసజూచి
రూప లక్ష్మిగ నిన్ను రూఢి గొలుతు
ఓర్పులో వసుధవై నేర్పుగా కూర్మితో
జన్మ సార్ధకతను చాటినావు
గీ|| జాతి జాగృతి పథ సంచార కతన
గత చరిత్రలు సాక్షమౌ గాజులమ్మ
నీదయా వర్ష సారపు నియమ మిదియె
ఆరు ధర్మంబులొప్పెడి దాలి యగును
- పరాక్రిజయ
శ్లో|| కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, షట్ధర్మ యుక్తా కుల ధర్మపత్నీ ||
( స్వేఛ్ఛానువాదం )
సీ|| సేవలందించు సంక్షేమ వర్తియై
భావనా స్ఫూర్తితో భవిత కొఱకు
అన్న పూర్ణాంబయై ఆకలి దీర్చుచు
రతికామ రసరాజ్య రంభయగుచు
ముగ్ధ మోహన నీదు ముఖవిలాసజూచి
రూప లక్ష్మిగ నిన్ను రూఢి గొలుతు
ఓర్పులో వసుధవై నేర్పుగా కూర్మితో
జన్మ సార్ధకతను చాటినావు
గీ|| జాతి జాగృతి పథ సంచార కతన
గత చరిత్రలు సాక్షమౌ గాజులమ్మ
నీదయా వర్ష సారపు నియమ మిదియె
ఆరు ధర్మంబులొప్పెడి దాలి యగును