విజయాభిదేయము
కవితాశిరోమణి : శ్రీ పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రి)
ఉ|| స్వాగతమమ్మ ఓ విజయ వత్సర నామపు చాంద్రమానమా
కవితాశిరోమణి : శ్రీ పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రి)
(
తే.ది 17-03-2013 నాడు కంచర పాలెం మెట్టు- విశాఖపట్నం వద్ద జరిగిన కవి
సమ్మేళనంలో బ్రహ్మజ్యోతి పత్రిక వారికి బహూకరించిన విజయాభిదేయ పద్య త్రయం )
ఉ|| స్వాగతమమ్మ ఓ విజయ వత్సర నామపు చాంద్రమానమా
స్వాగతమమ్మ భావకల భాసిత రాశిత సుందరీ రమా !
స్వాగతమాంధ్ర జాతికిని సంస్కృతి సన్నుతి పొందు వృద్ధికిన్
స్వాగతమాంధ్ర జాతికిని సంస్కృతి సన్నుతి పొందు వృద్ధికిన్
ఆగత షడ్రుచీ కలన యానవయారపు వైజయంతికా !
సీ|| రాజు గురుడగును రాష్ట్రాధిపతివోలె
సుస్థిరత్వము కల్గు శుభములందు !
మంత్రి భాస్కరుడగు మాన్య ప్రధానిలా
కల్లోల మతమౌఢ్య కలతలందు !
నవనాయకులతో భవసాగరంబగు
కర్ష కార్మిక శక్తి హర్ష ప్రదము!
సరుకు ధరవరలు పెరుగుటే ధరణిలో
తరుగు దల నెపుడు దలపరాదు !
గీ|| పేదసాదల గతులెల్ల బీదగాను
ధనికులున్నత పీఠముల్ దాల్చుచుండ
కొత్త వత్సర ఫలితమ్ము కోర్కె గాని
మార్పు లేముండు యోచింప తీర్పరులకు !
సీ|| పంచాంగ ప్రియులైన ప్రజలార వినరండి
ద్వాదశ రాశుల వర్ష ఫలము
ఆగ్రహాను గ్రహ నిగ్రహ గ్రహముల
ఘటనా ఘటనల సంఘటన తెలియ
ఏ రాశి మీదైన ఏ తార వారైన
ఫలితాల విషయమై కలత వలదు
కందాయ ఫలితముల్ ఖర్చుకున్ దగినట్లు
ఆదాయమును వ్యయం బప్పు బట్టి ||
గీ|| రాజపూజావమానము రాజకీయ
తంత్రమును బట్టి , రాశి సత్ఫలములెల్ల
కొత్త వత్సర మందలి కోర్కె బట్టి
గట్టి యత్నము చేసిన గాంచ గలరు.
సీ|| రాజు గురుడగును రాష్ట్రాధిపతివోలె
సుస్థిరత్వము కల్గు శుభములందు !
మంత్రి భాస్కరుడగు మాన్య ప్రధానిలా
కల్లోల మతమౌఢ్య కలతలందు !
నవనాయకులతో భవసాగరంబగు
కర్ష కార్మిక శక్తి హర్ష ప్రదము!
సరుకు ధరవరలు పెరుగుటే ధరణిలో
తరుగు దల నెపుడు దలపరాదు !
గీ|| పేదసాదల గతులెల్ల బీదగాను
ధనికులున్నత పీఠముల్ దాల్చుచుండ
కొత్త వత్సర ఫలితమ్ము కోర్కె గాని
మార్పు లేముండు యోచింప తీర్పరులకు !
సీ|| పంచాంగ ప్రియులైన ప్రజలార వినరండి
ద్వాదశ రాశుల వర్ష ఫలము
ఆగ్రహాను గ్రహ నిగ్రహ గ్రహముల
ఘటనా ఘటనల సంఘటన తెలియ
ఏ రాశి మీదైన ఏ తార వారైన
ఫలితాల విషయమై కలత వలదు
కందాయ ఫలితముల్ ఖర్చుకున్ దగినట్లు
ఆదాయమును వ్యయం బప్పు బట్టి ||
గీ|| రాజపూజావమానము రాజకీయ
తంత్రమును బట్టి , రాశి సత్ఫలములెల్ల
కొత్త వత్సర మందలి కోర్కె బట్టి
గట్టి యత్నము చేసిన గాంచ గలరు.