పైడిమాంబ పంచకం
( విజయనగరం పైడితల్లమ్మవారి దర్శనానంతరం 1984 లో ఈ పరాక్రి పైడిమాంబ పంచకం విరచించడమైనది. ఈ రచనకు ప్రేరణ రావణబ్రహ్మ కృతమైన శివస్తుతి. )
1. శ్లో || సుందరాననా మరంద కుందచందనా స్వబంధు గంధసుందరీ
ఇందిరా ప్రభాప్రసూన ఇంద్రియాణి మందిరాసురాజ వందితా
విద్య నాగరీ గరీయశీ విశేష మేదినీ గజేంద్ర నందినీ
హే పురాధి దేవతా యశస్వినీ సుఖప్రదా సు పైడిమాంబికా ||
2. శ్లో || క్షీరసాగరోద్భవాని వాణ్యపర్ణ కంకణా కలాప నిక్వణా
మత్కవిత్వ చిత్తకామినీ సచిత్రరాగ రూపిణీ పరాగిణీ
భుక్తిముక్తిదాయినీ స్వశక్తియుక్తిచారిణీ ప్రసారిణీఘృణీ
హే పురాధి దేవతా యశస్వినీ సుఖప్రదా సు పైడిమాంబికా ||
3. శ్లో || సృష్టి పాలకే కపాలికే జ్జ్వలజ్జ్వల ప్రభాల కీల కాళికే
యోద్ధబుద్ధివర్ధినీ స్వరాజ్య వౄక్షకాండచారిణీ విహారిణీ
విశ్వమోహినీ విశేష గాత్రపోషణా విశాలనేత్ర భాసురా
హే పురాధి దేవతా యశస్వినీ సుఖప్రదా సు పైడిమాంబికా ||
4. శ్లో || క్షపాత వర్జితా విలక్షణ ప్రచార చక్షు దుష్టశిక్షకీ
అక్షర ప్రమోద యక్షిణీ సుశిక్షణా క్షణక్షణ ప్రదక్షిణీ
మల్లికామతల్లికా ప్రఫుల్ల పల్లవీ నవీన కీర్తి వల్లకీ
హే పురాధి దేవతా యశస్వినీ సుఖప్రదా సు పైడిమాంబికా ||
5. శ్లో || పావనీ నమోనమో మహద్నిరూఢకాత్మ శాంతి క్రాంతి కారణీ
యోగినీ నమోనమో భవద్గుణాలవాల హే! మదుక్త మాతృకా
నూత్న ఛంద వైభవాంగ విక్రగంధి రూపిణీ, " పరాక్రి " పంచికా
హే పురాధి దేవతా యశస్వినీ సుఖప్రదా సు పైడిమాంబికా ||
ఇది పరాక్రి విక్రగంధి నూతన ఛందో పంచకం. కృతకృత్యుడనైతే ధన్యుడను.