సాభిప్రాయం
ఉ|| నూకల వంశ సంభవుడు నూతన భావుక భావశీలియై
ఉ|| నూకల వంశ సంభవుడు నూతన భావుక భావశీలియై
ప్రాకటగూర్చె నా
పదము వ్రాతకు నాపథమంచు శోభగన్
ఏ కల నిష్కళంక
పరిధేయము గానుదయింపగా సదా
సాకలనంబు కావ్యగతి
సంతస మొప్పగ కూర్పునేర్పుమై ||
మిత్రులు శ్రీయుతులు
నూక సూర్యప్రకాష్ మరియు వారి చి|| సౌ|| నాగలక్ష్మి నాకు చిరకాల పరిచితులు ఆత్మ
బంధువులు. వారి కవితా సంకలనం సద్గురు స్మరణతో సాగి మూడులో వారి కాంక్ష తెలిపారు
ఆలోచించుకునే ఆత్మావిష్కరణ మన గతంలో నాటికీ నేటికీ జేజేలు పలుకుతూ పండువుగా పండగగా
ఒక్కటే అనే సాభిప్రాయానికి అందరూ రావాలి ఇది వెర్రీకాదు సర్రయిలిజమ్ అంతకన్నా
కాదు. రచయిత మాటల్లోనే చెప్పాలంటే నాపదం నాపథం.
నిశీధిలో వైరస్
వుంటుందా ? వృక్షవిలాపం నిర్లక్ష్యమవుతోందా? రచయిత అద్భుత ఆవిష్కరణ- కార్యకారణాలు
నీవే అంటుంది. పాంచజన్యం పూరించినా, ఏ శోధన గావించినా ఎవరికోసం! మనుషుల
మనస్తత్వాన్ని కాచి వడపోసిన గురుబోధ నాయకత్వం నాకున్నాయని రచయిత ఆబగా ధర్మాన్ని
చరిత్రకెక్కించే ప్రయత్నం చేస్తాడు. ఎవరు చచ్చినా ( హంత ) వర్ణ వైకల్యాలెన్ని
కలిగినా మర్మం మారదు. ఇది ఇంతే. మనిషి మృగంలా సంచరించ కూడదు కదా! పూనికతో ప్రణయ
ప్రకృతిని సాక్షాత్కరించుకోవడమే నా పదం నాపథం ........ ............................
కవి ఆల్కెమీ మీరూ
సందర్శించండి.
contact for సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు
9966455872
------------ పంతుల వెంకట
రాధాకృష్ణ (పరాక్రి )
గ్రేడ్
వన్ తెలుగు పండిట్