అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

18, ఏప్రిల్ 2013, గురువారం

యాకుందేందు తుషారహార........ శ్లో || నకు తెనిగింపు

    ( యాకుందేందు తుషారహార........ శ్లో || నకు తెనిగింపు )

ఉ||  కుందము నిందుచందము నికుంజ తుషారముబోలి తెల్లనౌ
       చందములీను వస్త్రముల సంస్థిత పద్మము నాసనంబుగా
       వందిత వీణ దాల్చు ఘన వాగధి దేవత నిన్ను గొల్తు రా
       బృంద జగ ద్రిమూర్తులును భారతి నా జడతార్తి బ్రోవవే ||

                 - పరాక్రి