ఏ వండోయ్ మాష్టారు, మీరు మొదలు వదిలి చివర పట్టుకున్నారేమిటి?
సూటిగా ప్రశ్నించింది జ్యోతి
అది విమర్శో , ప్రశంసో తెలీక ఎగాదిగా చూసాడు పరాక్రి,
అదేనండి పరాక్రి పదనిసలు అని రాసారు కదా ! మరి సరిగమలు ఏవి?
ఓ హో ! అదా నా రచనలు అన్ని క్రోడికరించి దానికి పరాక్రి పదనిసలు అనే బ్లాగు పేరు పెట్టాను.
సరిగమల సంగతి సంగీతఙ్ఞులు చూసుకుంటారు. పదనిసలు నా సాహిత్యరచనలు.
ఇదిగో అమ్మాయి అసలు మొదట నా బ్లాగుకు "పరాక్రియం" అని పేరు పెట్టాలి అనుకున్నాను.
తీరా చూస్తే ఏప్పుడో వారానికో మాసానికో ఓ సాహిత్యాంశాన్ని స్పృశించడం తప్ప నేనేం పెద్దగా రచనలు చేయడం లేదు. అందునా ఓ ఇరవై ఏళ్ళ క్రితం రాసిన కధలు , నాటకాలు వగైరా పరాక్రి పదనిసలలో పొందు పరిచాను.
ఇప్పుడు కూడా అప్పుడప్పుడు, అడపాదడపా వ్రాస్తునే ఉంటాననుకో ............
అబ్బా మీరు వ్రాయలేరని కాదండీ పదనిసలలో పదాలను గూర్చి అడిగానంతే.
అడిగావుగనక చెబుతున్నాను. గుంటూరు నుంచి గోలి హనుమచ్ఛాస్త్రి గారు నా బ్లాగు చూసి ఇలా అన్నారు.
గోలి హనుమచ్ఛాస్త్రి has left a new comment on your post "చాటువులు-సమస్యాపూరణలు":
బహు ముఖ విషయంబులతో
బహు బాగుగ నుండె బ్లాగు ' పంతుల ' వారూ!
ఇహ విజ్ఞులు వీక్షింపగ
బహుమతులై పరగ వలయు ' పదనిస' లన్నిన్.
( Posted by గోలి హనుమచ్ఛాస్త్రి to పరాక్రి పదనిసలు at February 19, 2012 1:16 PM on పరాక్రి కవితలు )
గొప్ప కోసం పునశ్చరించ లేదు కాని
తెల్ల కాగితాన్ని నల్లబరిస్తే,
ప్రపంచానికి అందిస్తే,
విషయాన్ని బట్టి,
కాగితపు బరువు విలువలు మారుతుంటాయి.
రంగు కాగితం ఆకర్షిస్తే ,
డబ్బు కాగితం భరోసానిస్తే ,
డాక్యుమెంట్ల , అస్తిపాస్తులు విస్తరిస్తుంటే ,
ఏ కాగితపు విలువ దానికుంటుంది
చిత్తుకాగితం కూడా
ఉపయుక్తం కాగలదు , వినియోగదారుని
నియోగంలో ............
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ,
జ్యోతి నీ మాటలు చివరగా నైనా చివురులు పుట్టిస్తాయని,
సరిగమలు రాకున్నా పదనిసలు పలుకుతాయని ,
విశ్వశిస్తూ ఇకపై నా భావాలను
పద పద నిసలుగా వ్రాస్తా ,
మళ్ళీ కలుస్తా .. .. .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి