అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

11, అక్టోబర్ 2016, మంగళవారం

దుర్గ సీసజము

సీ॥
ఆయమ్మ దయలతో ఆరంభమైనట్టి
          పద్యమౌ గద్యమౌ హృద్య మంబు
గీర్వాణ శార్వాణి కేలునుంబట్టగా
               అక్షర క్రమములందాడుకొనమె
యక్షీణ లక్ష్మిగా యామమౌ భామినిన్
              సంపాద సామ్రాజ్ఞి సాహితముగ
మంగళ ప్రదమైన మాన్యాభిమానమై
               మానవోద్రేకతన్ మసలుచుండ

సత్కవిత్వపు భాషణా సారసంబు
మహిత మాన్యత దేదీప్యమాన మగుచు
మనము వికసించు మాధురీ మలయజముగ
దుర్గ మాయమ్మ యీవుత దూరదృష్టి

నా భార్య కోరికపై ఆశువుగా చెప్పన సీస పద్యమిది.

అంబ దయ ఉంటే పద్యమైన గద్యమైన హృద్యమంగా వస్తుంది అమ్మవారి చేయి పట్టుకుంటే అక్షరాలతో ఆడుకోవచ్చు. సాహిత్య సంపద క్షీరసాగర కన్యగా (లక్ష్మీ ) లభ్యమవుతుంది. మంగళగౌరి కవితా ప్రేరేపితమై మాన మానవ గౌరవాన్ని అందిస్తుంది ఇది కవిత్వ భాషణ. దేదీప్య భూషణ మనోవికాసానికి  మలయ మారుతం. దుర్గాదేవి అట్టి దృష్టిని కలుగ జేయును (ముగ్గురమ్మల ప్రశక్తి తో ఇది సీస పద్య తాత్పర్యము )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి