కందళిత లలితా స్తవం
(తారావళి)
(తారావళి)
1. కం || శ్రీమాత మహారాజ్ఙీ
శ్రీమత్సింహాస వాస శ్రీ లలితాంబా|
నామాను రాగ పఠితా
సామాంపాతు పరమాత్మసంపద్లలితా||
2. కం || శ్రీ విద్యా చరణాంకిత
భావద్వయ సుగుణహార భాషా జననీ|
నీవారాంతర బీజయ
శ్రీ వాణీ రమ భవాని చిద్ఘన లలితా||
3. కం || శ్రీవిద్యా నిధివై ధర
భావింపగ సృష్టికార్య పాలన లయముల్|
దేవీ నిత్యా జేతువు
కావగ ప్రార్థింతు నిన్ను కమలా లలితా||
4. కం || యాగా నందిని యోగిని
రాగాడంబర శశాంక రాగిణి రమణీ|
భోగాసక్త పయోధిని
సాగీర్వాణీ ప్రఫుల్ల సాహితి లలితా||
5. కం || మాధవ హౄదయ విహారీ
రాధా జగదీశ రాణి లంపట లాస్యా|
వేదారాధిత బ్రహ్మణి
నీదాసుని బ్రోవు మమ్మ నిర్మద లలితా||
6. కం || శ్రీ సూక్తము జపియించెద
నీసేవలు చేయదలుతు నిర్మల భక్తిన్
శాసించిన కార్యములవి
భాసురమౌ నీపదాల బాసట లలితా||
7. కం || శ్రీ గిరిజా శారదవై
త్రైగుణ శోభిత శుభాంగ త్రిగుణాతీతా
రాగిణివై కవితానుత
వాగధి దేవతవు నీవు వందన లలితా||
నామాను రాగ పఠితా
సామాంపాతు పరమాత్మసంపద్లలితా||
2. కం || శ్రీ విద్యా చరణాంకిత
భావద్వయ సుగుణహార భాషా జననీ|
నీవారాంతర బీజయ
శ్రీ వాణీ రమ భవాని చిద్ఘన లలితా||
3. కం || శ్రీవిద్యా నిధివై ధర
భావింపగ సృష్టికార్య పాలన లయముల్|
దేవీ నిత్యా జేతువు
కావగ ప్రార్థింతు నిన్ను కమలా లలితా||
4. కం || యాగా నందిని యోగిని
రాగాడంబర శశాంక రాగిణి రమణీ|
భోగాసక్త పయోధిని
సాగీర్వాణీ ప్రఫుల్ల సాహితి లలితా||
5. కం || మాధవ హౄదయ విహారీ
రాధా జగదీశ రాణి లంపట లాస్యా|
వేదారాధిత బ్రహ్మణి
నీదాసుని బ్రోవు మమ్మ నిర్మద లలితా||
6. కం || శ్రీ సూక్తము జపియించెద
నీసేవలు చేయదలుతు నిర్మల భక్తిన్
శాసించిన కార్యములవి
భాసురమౌ నీపదాల బాసట లలితా||
7. కం || శ్రీ గిరిజా శారదవై
త్రైగుణ శోభిత శుభాంగ త్రిగుణాతీతా
రాగిణివై కవితానుత
వాగధి దేవతవు నీవు వందన లలితా||
8. కం || ఒకతే ఒకతెను పదుగురు
ప్రకటింతురు బుద్ధి కొద్ది పద్ధెనిమిదిగా
సకలంబమ్మలు ముగ్గురు
ఒకతే ఒకతిగ కనుగొను నూహన్ లలితా||
9. కం || మేధా మోదిత బ్రహ్మణి
సాధారణ సంచరిత వసాధారణ ధా
రాధావళ్య గుణా పృధు
గాధా స్తవనీయ భావ కవితా లలితా||
10. కం || శ్రీ దేవీ నామములవి
సాధన యుక్తము రహస్య సాధనముల వే
సాధకుడైనను నిత్యము
సాధన జేయుటనుగల్గు సాగరి లలితా||
ప్రకటింతురు బుద్ధి కొద్ది పద్ధెనిమిదిగా
సకలంబమ్మలు ముగ్గురు
ఒకతే ఒకతిగ కనుగొను నూహన్ లలితా||
9. కం || మేధా మోదిత బ్రహ్మణి
సాధారణ సంచరిత వసాధారణ ధా
రాధావళ్య గుణా పృధు
గాధా స్తవనీయ భావ కవితా లలితా||
10. కం || శ్రీ దేవీ నామములవి
సాధన యుక్తము రహస్య సాధనముల వే
సాధకుడైనను నిత్యము
సాధన జేయుటనుగల్గు సాగరి లలితా||
11. కం || లీలా కల్పిత జననీ
సాలగ్రామా, యపూర్వ సారణి గరిమా
బాలా శ్యామల శారద
కాళీ లక్ష్మీ భవాని గంగా లలితా||
12. కం || రాజేశ్వరి గాయిత్రీ
పూజింపంబడు దశవిధ పుణ్య చరిత్రన్
భాజనమై ధర నొప్పుచు
రాజిలెడి మదంబ గుంభ రామా లలితా||
13. కం || కడపటి జన్మంబున తల
పడి జేకొనును, ప్రియ భక్తి పారాయణమున్
కడువడి లలితా నామము
నుడువగ శ్రీవిద్య నిరత ముర్విని లలితా||
14. కం || పలికెడి పలుకుల్ స్తవమై
పలుకింపుగ నీదు భావ పరమై పరగన్
పలికిన పలుకులు నిలలో
ఫలవంతమవును ! సదమల పావని లలితా||
15. కం | | పూర్ణిమ చంద్రుని యందున
పూర్ణ ధ్యానమున యంబ పూజలు సలుపన్
వర్ణిత విశేష మదియు, య
పర్ణను గొలుచుటయె సాధ్య భావము లలితా||
16. కం || అమ్మాయమ్మల గన్నది
అమ్మను ముగురమ్మలందు నాదిని యమ్మై
అమ్మగ ధరజెల్లెడి తా
నమ్మల కమ్మను బిలిచెద నంబా లలితా||
17. కం || లక్షణ సౌందర్య లహరి
ఇక్షుః కాండాప్రపాణి ఈశ్వర రమణీ
ప్రక్షాళిత వర్ఛస్ఫుర
దాక్షాయిణి జన్మ కర్మ దాయిని లలితా||
సాలగ్రామా, యపూర్వ సారణి గరిమా
బాలా శ్యామల శారద
కాళీ లక్ష్మీ భవాని గంగా లలితా||
12. కం || రాజేశ్వరి గాయిత్రీ
పూజింపంబడు దశవిధ పుణ్య చరిత్రన్
భాజనమై ధర నొప్పుచు
రాజిలెడి మదంబ గుంభ రామా లలితా||
13. కం || కడపటి జన్మంబున తల
పడి జేకొనును, ప్రియ భక్తి పారాయణమున్
కడువడి లలితా నామము
నుడువగ శ్రీవిద్య నిరత ముర్విని లలితా||
14. కం || పలికెడి పలుకుల్ స్తవమై
పలుకింపుగ నీదు భావ పరమై పరగన్
పలికిన పలుకులు నిలలో
ఫలవంతమవును ! సదమల పావని లలితా||
15. కం | | పూర్ణిమ చంద్రుని యందున
పూర్ణ ధ్యానమున యంబ పూజలు సలుపన్
వర్ణిత విశేష మదియు, య
పర్ణను గొలుచుటయె సాధ్య భావము లలితా||
16. కం || అమ్మాయమ్మల గన్నది
అమ్మను ముగురమ్మలందు నాదిని యమ్మై
అమ్మగ ధరజెల్లెడి తా
నమ్మల కమ్మను బిలిచెద నంబా లలితా||
17. కం || లక్షణ సౌందర్య లహరి
ఇక్షుః కాండాప్రపాణి ఈశ్వర రమణీ
ప్రక్షాళిత వర్ఛస్ఫుర
దాక్షాయిణి జన్మ కర్మ దాయిని లలితా||
18. కం || మదఘూర్ణిత రక్తాక్షీ
మద పాటల గండ భాగ మండిత గాత్రీ
మదశాలిని తేజోవతి
కదనోత్సాహా యవిరళ కాంతా లలితా||
19. కం || కాశిని విశ్వేశునితో
వాసిగ నీవన్నపూర్ణ భామినివై, ని
న్నాశించు జనుల బ్రోతువు
దాస జనావన జయప్రదా శ్రీలలితా||
20. కం || కనక సమాన సునాసిక
కనకాద్రి సమాన ధైర్య కనక సుగాత్రీ
కనకామలకా భూషిత
కనకోదర పూజితాంఘ్రి కమలాలలితా||
21. కం || అరుణారుణ కౌస్తుంభా
శరణాన్విత వత్సలతవు, శాంత నిశాంతా
చరణ యుగళ కమలాన్విత
సరసిజ భూషిత సురనుత శాంభవి లలితా||
22. కం|| ఏదేవీ కృపను గలుగు
సాధన సంపత్తులెల్ల సమకూరునిలన్|
వేదనలెల్లయు దీరునొ
ఆదేవిన్ నిన్ను గొలుతు నాత్మన్ లలితా||
23. కం || శ్రీమద్దివ్య మహాగుణ
కామితఫల సిద్ధిదాత కరుణా జలధీ|
శ్రామిక జన వాత్సల్యా
ప్రేమా! యనురాగ కలిత ప్రేమాలలితా||
24. కం || జాతక చక్రము లిమ్మని
ప్రీతిని ఫలితాల కొరకు ప్రియమారయగన్|
యేతెంచు జనుల కొప్పగు
రీతిని భాషించు శక్తులీయుమ లలితా||
25. కం || ఆయమ్మ దయల చేతను
వ్రాయంగల వాక్య మెల్ల వాసికి నెక్కున్|
‘జే’ యన చెప్పెద కావ్యము
మాయమ్మగు దోషచయము మహితను లలితా||
26. కం || ఉడుమండలి నుండెడి నీ
కడు రమ్యపు శోభ గాంచి కమనీయంగా
పడిగొని అక్షర పంక్తుల
వడి తారావళి నర్పింతు వారిజ లలితా||
మద పాటల గండ భాగ మండిత గాత్రీ
మదశాలిని తేజోవతి
కదనోత్సాహా యవిరళ కాంతా లలితా||
19. కం || కాశిని విశ్వేశునితో
వాసిగ నీవన్నపూర్ణ భామినివై, ని
న్నాశించు జనుల బ్రోతువు
దాస జనావన జయప్రదా శ్రీలలితా||
20. కం || కనక సమాన సునాసిక
కనకాద్రి సమాన ధైర్య కనక సుగాత్రీ
కనకామలకా భూషిత
కనకోదర పూజితాంఘ్రి కమలాలలితా||
21. కం || అరుణారుణ కౌస్తుంభా
శరణాన్విత వత్సలతవు, శాంత నిశాంతా
చరణ యుగళ కమలాన్విత
సరసిజ భూషిత సురనుత శాంభవి లలితా||
22. కం|| ఏదేవీ కృపను గలుగు
సాధన సంపత్తులెల్ల సమకూరునిలన్|
వేదనలెల్లయు దీరునొ
ఆదేవిన్ నిన్ను గొలుతు నాత్మన్ లలితా||
23. కం || శ్రీమద్దివ్య మహాగుణ
కామితఫల సిద్ధిదాత కరుణా జలధీ|
శ్రామిక జన వాత్సల్యా
ప్రేమా! యనురాగ కలిత ప్రేమాలలితా||
24. కం || జాతక చక్రము లిమ్మని
ప్రీతిని ఫలితాల కొరకు ప్రియమారయగన్|
యేతెంచు జనుల కొప్పగు
రీతిని భాషించు శక్తులీయుమ లలితా||
25. కం || ఆయమ్మ దయల చేతను
వ్రాయంగల వాక్య మెల్ల వాసికి నెక్కున్|
‘జే’ యన చెప్పెద కావ్యము
మాయమ్మగు దోషచయము మహితను లలితా||
26. కం || ఉడుమండలి నుండెడి నీ
కడు రమ్యపు శోభ గాంచి కమనీయంగా
పడిగొని అక్షర పంక్తుల
వడి తారావళి నర్పింతు వారిజ లలితా||
27. కం || జయ జయ మంగళ గౌరీ
జయ జయ రమణీ భవాని జయ జయ లక్ష్మీ|
జయ జయ విద్యా వాణీ
జయ జయ మాతా గణాంబ జయ సుధ లలితా||
జయ జయ రమణీ భవాని జయ జయ లక్ష్మీ|
జయ జయ విద్యా వాణీ
జయ జయ మాతా గణాంబ జయ సుధ లలితా||