అశ్రుతర్పణం
( కాకతీయ ఖిల్లాదర్శించిన సందర్భమునస్ఫందన, తే.ది.12-12-1986, హన్మకొండ )
1. ఉ|| శ్రీవిభవమ్ములన్ వడసి శ్రేష్ఠ విశిష్ఠ ప్రతిష్ట నిష్టకున్
భావి పురాతనాద్యతన భాసుర సంస్కౄతి కాలవాలమౌ
కోవకు సాక్షిగా మిగిలె కోమల శిల్పములొప్పు ఓరుగల్
నే వచియింప శక్యమగునే రచియింతును చూచినంతగా ||
2. తె|గీ| నీదు చరితమదెంతేని నిర్మలంబు
శక్తి కాకతి ప్రతిభా ప్రసక్తి మీర
ఏకశిల నగరంబును నేలినట్టి
రాజులెంతేని ధన్యులు రమ్యగతిని ||
3. ఉ|| కాకతి రుద్ర వంశము కకావికలయ్యిన వ్రయ్యలివ్వియో
ఏకశిలా పురంబు ఘనులేలిన వారల పూర్వవైభవం
బో, కనిపించు శిల్పకళ మూర్తూల నాక విలోకనా ప్రభల్
ఏకరణిన్ మదిన్ దలతు నెన్మిది వందల యేండ్లదౌటచే||
4. ఉ|| చెక్కిన రాతి కంబముల జిల్గుల వెల్గులు భాసురంబుగా
పెక్కులు కుప్పకుప్పలుగ బీటలు వారుట శీర్ణ జీర్ణమై
స్రుక్కుచునున్న దివ్య కళ రూపవిహీనత గన్నవాడనై
ఒక్క పరిన్ మదిన్ కలతనోర్వక నేడ్చితి కోట ముంగిటన్||
5. ఉ|| కాయనికాయ గాయముల కాంతలు, యోద్ధుల శీర్ష ఖండముల్
తోయజ చక్రభంగములు, తోకలు బోయిన నంది విగ్రహాల్
సాయము గూలి చీలిపడె సత్త్వ సమున్నత దుర్గ కుడ్యముల్
ప్రాయిక శిల్పకల్ప భవ ప్రాభవ వైభవ శోభనా తతిన్ ||
6. తె|గీ| కవియొకని కావ్యమున్ నేను గనియు, సంత
సించితి మరియు మురిసితిన్ చిత్ర లేఖ
నమున, కని - విని సంగీత నాట్య కళల
శిల్పముల్ గని యేడ్చితిన్ శిథిల మగుట ||