9. సీ|| మది నిన్ను తలపోసి మమత రంగులు పూసి
హృదయాంతరస్థమౌ సదనమందు
చిందులేసెడి కాంత శ్రీకార విశ్రాంత
కలనుండి ఇలలోకి కదలిరావె
కావ్య కళానురాగ కమనీయ రమణి
వర్ణింతు పద్యాల వచనమందు
పద పదంబులయందు పాదానుమోదమై
నర్తించి వర్తించి నడచిరావె
హృదయాంతరస్థమౌ సదనమందు
చిందులేసెడి కాంత శ్రీకార విశ్రాంత
కలనుండి ఇలలోకి కదలిరావె
కావ్య కళానురాగ కమనీయ రమణి
వర్ణింతు పద్యాల వచనమందు
పద పదంబులయందు పాదానుమోదమై
నర్తించి వర్తించి నడచిరావె