ఈ వారం 24.03.2013 దత్త సమస్య " కలహమె సర్వ సౌఖ్యముల కారణమౌను వివేకమున్నచో "
చం|| చెలితొలి ప్రేమపాటవము చేష్టలు చూపులు ఆలకింపులున్ మలిగొను మాట మార్దవము మానుట బూనుట కేళిలోల నం
బలుగుట ఆశ జూపుటయు యందము చిందెడి గోము, నెయ్యపున్
కలహమె సర్వసౌఖ్యముల కారణ మౌను వివేక మున్నచో ||
- పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రిజయ) పూరణము.
ది. 17-3-2013 , చోడవరం.