అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

24, మార్చి 2013, ఆదివారం

సమస్య - కలహమె సర్వ సౌఖ్యముల కారణమౌను వివేకమున్నచో

ఈ వారం  24.03.2013   దత్త సమస్య  " కలహమె సర్వ సౌఖ్యముల కారణమౌను వివేకమున్నచో "
చం||  చెలితొలి ప్రేమపాటవము చేష్టలు చూపులు ఆలకింపులున్
        మలిగొను మాట మార్దవము మానుట బూనుట కేళిలోల  నం
        బలుగుట ఆశ జూపుటయు యందము చిందెడి గోము, నెయ్యపున్
        కలహమె సర్వసౌఖ్యముల కారణ మౌను వివేక మున్నచో ||

                       -   పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రిజయ) పూరణము.
                              ది. 17-3-2013  ,   చోడవరం.

1 వ్యాఖ్య:

  1. పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ఈ సమస్యను“కలహములే సకల సౌఖ్య కారణము లగున్" అని కందపాదంగా మార్చి నా ‘శంకరాభరణం’ బ్లాగులో ఇవ్వాలనుకుంటున్నాను.
    అనుమతి ఇవ్వవలసిందిగా మనవి.

    ప్రత్యుత్తరంతొలగించు