25, నవంబర్ 2018, ఆదివారం
11, అక్టోబర్ 2018, గురువారం
దుర్గా దశావతార కందాలంకృతి
దుర్గా దశావతార కందాలంకృతి :-
కం// దసరాదశమిది పండగ
దశవిధ మాతలనుగూర్చి దర్శింపంగా
అసలుసిసల్ నవరాత్రులు
దశమికి దేవతల యనుపు ! దసరాయనగా
1. పాడ్యమి బాల :-
కం// బాలా త్రిపురపు
సుందరి
మేలై పాఢ్యమి మొదలుత మెరయును భువిలో
చాలా నవరూపంబులు
నాలంకారముల వెలుగునారింభముతోన్
2. విదియ గాయత్రి:-
కం// ధ్యేయము నీవై విదియకు
కాయము ఉన్నంతవరకు గాయిత్ర్యంబన్
బాయక జపనియమముతో
భూయో భూర్భువ యగణిత భువనా గవనా
3 తదియ అన్నపూర్ణ :-
కం// ఆహార్యంబులు
నిచ్చెడి
మాహాత్యము నన్నపూర్ణ మాతకు తదియన్
స్వాహా కారముల మెలగి
ఓహో నర్చింతుమమ్మ ఓనమ నమితా
4. చవితి
శాకంబరీ :-
కం// చవితికి రూపము
నీవని
భవితకు శాకంబరియని
భావింపంగా
నవకవితత్మాక దేవీ
భువి నర్చింతుమిపుడు నిన్ను భువనేశ్వరిగా
5. పంచమి లలిత:-
కం// పంచమి నాడే మంచిగ
సంచిత కర్మముల , లలిత సంతులితాత్మన్
గాంచిన కాంచెన రూపిణి
యెంచుమ ఆగామిలబ్ధ యెలమిన్ గలిమిన్
6. షష్ఠి
మహాలక్ష్మి :-
కం// మెచ్చెడి తనువిభవముతో
లచ్చికి షష్ఠ్యాది నుండి లావణ్యముగా
విచ్చేయు రూపమనంతము
నిచ్చెము నీనామజపము నిజమది
గమలా
7. సప్తమి
సరస్వతి:-
కం//
సప్తమి మూలము పూజకు
ఆప్తముగా దోచుచుండు నందరి మదిలో
క్షిప్త సరస్వతి రూపము
గుప్త ముగా నినుదలంప గూఢము దెలియున్
8. అష్టమ
దుర్గ :-
కం//
దుర్గా దుర్గా యనుచును
దుర్గమ సంసారి యెపుడు - దుర్గాష్టమితో
దుర్గను భజియించు నెపుడు
దుర్గ యె కాపాడు మనుజు దురితము బ్రోచున్
9. నవమి మహిషాసుర మర్దిని :-
కం//
మాహర్నవమికి రూపము.
ఆహుతమై మహిష చండ ఆవిర్భవమౌ.
ఓహోదేవీ స్తుతమతి
హాహా కారముల శాంతి
నందగ గనుమా
10. దశమి శ్రీ రాజరాజేశ్వరి :-
కం// ఆరాధింపగశక్తిని.
శ్రీ రాజేశ్వరి దశదిస చిన్మయదేవిన్
కోరిన వరముల నొసగగ
తారాపథమందజేర్చు తత్ప్రాభవమై