అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

30, జూన్ 2012, శనివారం

శ్రీ బులుసు వేంకటేశ్వర్లు పదవీ విరమణ - ప్రస్తుతాంజలి.



                                     
            
                                           ప్రస్తుతాంజలి                       
     కం//    శ్రీ  ధీయుక్తుని బుధుని  న
              సాధారణు ప్రతిభు విఙ్ఞుని సంస్కారయుతున్
              మేథోన్నతు బులుసు కవిని
              ప్రాధానిక గురుని నేడు ప్రస్తుతి జేతున్ //

     గీ //    తెలుగు పండిత లోకంబు దెలియునట్లు
              తేట దెల్లము జేసెను ధీటుగాను
              నేటి ఉద్యోగ విరమణ నాటి వరకు
              సాటి లేనట్టి ఒజ్జగా సంచరించె //

     ఉ //    భారతి రూపుదాల్చినది భాగ్యవశంబుగ దర్శనీయమై
              పేరుకు వేంకటేశ్వరులు, పేర్కొన “పండుగ” జేసె, కావ్యముల్
              సారస రమ్యమై, బులుసు సాహితి నల్గడ నాంధ్రదేశమున్
              తారటలాడెనో యనగ తధ్వని మువ్వగ మ్రోగె మిత్రమా! //


                                



తే.ది. 30-06-2012 నాడు పదవీ విరమణ పొందుచున్న సాహితి మిత్రులు                 
                 శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారికి
          పరాక్రిదంపతులు   మర్పించుచున్న  ప్రస్తుతాంజలి.

contact for సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు
9966455872
                                                                          ------------    పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రి )
                                                                                                   గ్రేడ్ వన్ తెలుగు పండిట్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి