అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

23, ఫిబ్రవరి 2013, శనివారం

సుధారామమ్ కావ్యాంకితముగా సంపాదకునిపై ప్రశంస


         సుధారామమ్ కావ్యాంకితముగా సంపాదకునిపై ప్రశంస       
                                               
          కం//   ఎందరొ మాహాత్ములు గల
              సుందర గ్రంధాలయమున శోభస్కరమై
              పొందె సుధారామంబిట
              విందై ఆవిష్కృతమయి విఙ్ఞుల ఒడిలో//
    తే//గీ//  మోదు రాజేశ్వరుడు సమ్ముదము తోడ
              సత్యమూర్తి ఛారిటబులు స్వాగతించి
              ప్రచురణంబొన గూర్చెనీ పద్య వితతి
              శారదా సత్కృపా సార సరణి ధరణి//
  తే//గీ//    ఆణిముత్యము లెన్నియొ యలరు చుండ
              నాకు సత్కార మొనరింప నాయ మగునె
              ప్రియమె కవితాశిరోమణి బిరుదు నిచ్చె
              మోదమామోద మధురమీ మోదు క్రియలు//
  ౩౧/౦౭/౨౦౧౧                                                 ఇట్లు
  భీమునిపట్నం                          పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రి)    

16, ఫిబ్రవరి 2013, శనివారం

బాలల రామాయణం పై సాభిప్రాయం

                                                                                                  
                                                                                                      14/2/2013
                                                                                                     బెంగుళూరు.

గంటి లక్ష్మీనరసింహమూర్తి,  
B.Sc;B.Ed;C.A.I.I.B;PGD IR&PM(Bharateeya Vidyabhavan)    
  # ff- 3 శ్రీసాయిరామ్ రెసిడెన్సీ                                   
 బెంగుళూరు.  9వ  మెయిన్ రోడ్డు,ఎమ్.ఎస్.ఆర్.ఎస్.నగరు                                      

  విజయాబ్యాంకు లే అవుటు
బెంగుళూరు-
560076.           
         
              
 శ్రీ పంతుల రాధాకృష్ణగారికి నమస్కారం.
    మీరు పంపిన బాలరామాయణం ఆన్లైనులో చదివేను.బాలవిద్యార్ధులకు మీరు చేస్తున్నసాహితీసేవ  
    అభినందనీయం.
పంతులవారు,ఆరామద్రావిడశాఖకు చెందిన బ్రాహ్మణ వంశానికి చెందిన తెలుగు పండితవంశం గతరెండుదశాబ్దాలులుగా వారి సాహితీ సేవ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఆ సాహితీవంశ వృక్షానికినికి తల్లివేరు బ్రహ్మయ్యగారైతే చిగురు కొమ్మ రాధాకృష్ణగారు. చేవగలిగిన కవి.
    సుమారు రెండేళ్ల క్రిందట రచించిన బాలరామాయణం చదివే భాగ్యం నాకిప్పుడు కలిగింది.  అందాల రాముని కధకదా అందుకని అందంగా బాలల నాకర్షించే విధంగా ముద్రించేరు.శ్రీ అనిల్ జోషీగారు ముఖచిత్రాన్నిసర్వాంగసుందరంగాచిత్రించేరు.మహాపతివ్రతఅహల్యచిత్రాన్నికూడా(రామపాద మహిమ తెలిసేటట్లుగా)చిత్రించేరు.పిల్లలకి రామకోటియంటే యేమిటో తెలిసేవిధంగా కొంత వ్రాసి చూపించేరు.
శ్రీ రాముని అత్యంత ఉన్నతాదర్శం పితృవాక్యపరిపాలన.కవిగారిది కూడా అదేకావడం విశేషం. వారీ బాలరామాయణం ముద్రించి పితృ ఋణ విముక్తులయినారు.
వీరిది సరళ సుందరమైన శైలి. లలిత పదాలతో చిన్న చిన్న పద్యాలలో అమితమైన భావన పొందుపరిచేరు.బాలలకు కావలసిన నీతి ధర్మము బోధించే ముఖ్యపాత్రలును చక్కగా తీర్చి దిద్దేరు.రామాయణంలో కనిపించే అన్ని ముఖ్యపాత్రలతో పాటు బాలురకు ఆనందాన్నిచ్చే జటాయువు,సంపాతి,ఫక్షిజాతి పాత్రలను కూడా చేర్చి నూరు పద్యాలలో రామాయణ మహాకావ్యాన్ని బాలలకు తమకవిత్వాదర్శంలో ప్రతిబింబించడంలో కృతకృత్యులయ్యారు కవిగారు.కొండ అద్దమందు కొంచెమైయుండదా.
తెలుగు నుడికారాన్ని,జాతీయాలను,సామెతలను సందర్భోచితంగా పద్యములలో భద్రపరచి ముందు తరానికి అందేటట్టు చేసేరు.
మొదటిపద్యంలో శతృదుర్భేద్యమైన అయోధ్యను చక్కగా చిత్రించేరు.రెండవ పద్యంలో “ఆపురమేలు..యనిప్రారంభించడం చేమకూరి వారిని తలపిస్తుంది.

పాత్రచిత్రణలు:


కౌశల్య-కలికిమిన్నగాదె కౌశల్యమునితుల్య(౩),నెలలు నిండుకొలది నెలతల కళ హెచ్చె(8)

అహల్య-తెలిసితాకుగాక,తెలియకతాకినన్  కరమునిప్పుసోక కాలుగాదె”(23) అహల్యతొందరపాటుతనాన్ని బాల బాలికలు సులభంగా గుర్తుంచుకోనేటట్లుగా తెలుగులో వ్రాసేరు కవిగారు

కైక-కైక యెక్క పేరాశని అధ్బుతంగా కుదించేరు కవిగారు-“ప్రేమ మరుగుపడును పెన్నిధి నాశింప(
39)

సీత-ఎట్టి పరిస్థితిలోనూ పతిని కలసియుండుటే భారత నారీ ధర్మమని ఎంతో చక్కగా వివరించారో చూడండి. “పతినిగలసియున్న వనియాన గిరియైన, రమ్యహర్మ్యమగును రమణికెపుడు” (42) 

లక్ష్మణుడు లక్ష్మణుని “లక్ష్మణార్యుడని” సంబోధించడం కవిగారి సంస్కారానికద్దం పడుతోంది(44)

భరతుడు-భరతునిచే పితృవాక్యపరిపాలన ముఖ్యం అని అనిపించిన తీరు అధ్బుతం.భరతుని పాత్రకు ఒక ఉదాత్తతను కల్పించేరు కవిగారు. “అన్నసొమ్ము దోచు అధముండు వీడను..(48)అనే అపకీర్తి నుండి ఆదుకొనమని భరతుడడగడం అన్నదమ్ముల మధ్య  సఖ్యతకి కవిగారి తీర్పు అధ్బుతం.

రావణుడు-కులమున రాజసంబు వీడడు రాక్షసుండు”(54).రావణుని రాజస గుణాన్ని బయటపెడుతుంది.

హనుంతుడు-రామపాదయుగళి వ్రాలెనపుడు”-హనుమంతుని సేవాధర్మానికి  చక్కనిరూపకల్పన చేసేరు.

వాలివధ- రాజులకు వేట ధర్మమమని  తీర్పు చెప్పేరు కవిగారు.
అశోకవనంలో  సీత-చక్కనిచుక్కను సీతను  “చుక్కలుకలంగి నభమున నిక్కి జూచె” ఎంతో అందంగా వర్ణించేరు.(72)

రావణుని అహంకారం -మూడులోకముల ముమ్మారు గెలిచిన నేనెక్కడ ,లేడిపిల్లనే పట్టుకోలేని రాముడెక్కడ”(74) .రావణుని నైజాన్ని అత్యద్భుతంగా వ్రాసేరు.


లంకాదహనం- చూచి రమ్మనిన కాల్చి వచ్చుట యనే నానుడి రామాయణంలోదే నని బాల బాలికలుకు తెలియజేసారు కవిగారు

విభీషణుడు-పిరికిపందవంచు పేరల్కతో..(87) విభీషణుని రావణుడు వర్ణిచింనతీరు రాక్షసులైన అన్నదమ్ములబంధానికి ప్రతీకైతే,

    లక్షణమూర్ఛ- భార్యకొరకు నిన్ను బలివెట్ట తమ్ముడ-(92) -అన్నదమ్ములాదర్శజీవనానికిది ప్రతీక

రావణవధ - విభీషణుడు రావణుని రహస్యాన్ని బయటపెట్టి రావణవధకు కారణమగుట -ఇంటి గుట్టు లంకకు చేటు రామాయణంలోనిదేనని తెలుగులకు తెలియ జేసారు కవిగారు(95)


 శ్రీరామ పట్టాభిషేకంతో కధకి సంపూర్ణత చేకూర్చారు పంతులవారు. 


 ఈ పుస్తకం బాలలందరికీ అవశ్య పఠనీయం.  

                                                                                              ------   గంటి  లక్ష్మీనరసింహమూర్తి  
_________________________________________________________________________________

http://www.scribd.com/doc/88054629/Balala-Ramayanam

2, ఫిబ్రవరి 2013, శనివారం

చాటువులు - 14

12.   గీ ||     ప్రణవ మంత్రము ఓంకార పఠనమందు
                  మనసు లగ్నము జేసినే మసల దలతు
                  వల్ల భారాధ్య కైలాస వాస దేవ
                  పార్వతీ సమభాగ సంపాద మోద ||

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

చాటువులు - 13

   తేగీ||      ఆంధ్ర భాషకు పట్టంపు టాణిమణుల
                     కావ్య కన్యక లెందరొ గజ్జెకట్టి
                     చిందులేయగ నుత్సాహ సింధువందు
                     పద్యమేదేని పలుకగా ద్యమగును ||