అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

28, మార్చి 2013, గురువారం

శంకరాభరణం బ్లాగులో నా పూరణ - 1

శంకరాభరణం బ్లాగులో నా పూరణ

 కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
హర నీవే శరణమ్ము నా కనియెఁ బ్రహ్లాదుండు సద్భక్తుఁడై.
హర నీవే శరణమ్ము నాకనియె   "ప్రహ్లాదుండు సద్భక్తుడై
సిరియాళుండు "  మహాప్రమోది గనుకే స్థేయాగ సంసిద్ధుడై
హరవైశిష్ట్య కథా ప్రధానమున - ఆహారంబు తానౌటకున్
దరలెన్ ! శంకర నీకృపల్ సులభ సాధ్యంబన్న బేరేలకో ?

27, మార్చి 2013, బుధవారం

సూటిగా.... -పంతుల జయమహేశ్వరి

    సూటిగా....
                  27-3-2013                                   -పంతుల జయమహేశ్వరి 


 చిన్నతనము వీడు చీకాకు బడబోకు
  పలుక, బెరుకు- భయము పాడిగాదు
     పద్య మొకటి చెప్పి ప్రకటింపభావముల్
         నిజము నిక్కువముగ ఋజువు గాదె ||

26, మార్చి 2013, మంగళవారం

దత్త సమస్య

ఈ వారం  24.03.2013   దత్త సమస్య  " కలహమె సర్వ సౌఖ్యముల కారణమౌను వివేకమున్నచో "
బలిమిని సర్వక్తులతొ భాద్యత యంచును యెంచి జేయుచున్
పలికిన వెంటనే తమకు పన్లొనరించిన మంచి, లేనిచో
ఖలులను బంధువర్గములు, కాదన వైరమె వచ్చుగాక, తత్
కలహమె సర్వసౌఖ్యముల కారణమౌను వివేకమున్నచో //
                                               పూరణ:- శ్రీమతి పంతుల జయ మహేశ్వరి  ( w/o పరాక్రి )
                                                                             చోడవరం.

24, మార్చి 2013, ఆదివారం

సమస్య - కలహమె సర్వ సౌఖ్యముల కారణమౌను వివేకమున్నచో

ఈ వారం  24.03.2013   దత్త సమస్య  " కలహమె సర్వ సౌఖ్యముల కారణమౌను వివేకమున్నచో "
చం||  చెలితొలి ప్రేమపాటవము చేష్టలు చూపులు ఆలకింపులున్
        మలిగొను మాట మార్దవము మానుట బూనుట కేళిలోల  నం
        బలుగుట ఆశ జూపుటయు యందము చిందెడి గోము, నెయ్యపున్
        కలహమె సర్వసౌఖ్యముల కారణ మౌను వివేక మున్నచో ||

                       -   పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రిజయ) పూరణము.
                              ది. 17-3-2013  ,   చోడవరం.

21, మార్చి 2013, గురువారం

విజయాభిదేయము

                            విజయాభిదేయము
                                    కవితాశిరోమణి : శ్రీ పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రి)

     

 ( తే.ది 17-03-2013 నాడు కంచర పాలెం మెట్టు- విశాఖపట్నం వద్ద జరిగిన కవి సమ్మేళనంలో బ్రహ్మజ్యోతి పత్రిక వారికి బహూకరించిన విజయాభిదేయ పద్య త్రయం )               

ఉ||  స్వాగతమమ్మ ఓ విజయ వత్సర నామపు చాంద్రమానమా 
స్వాగతమమ్మ భావకల భాసిత రాశిత సుందరీ రమా !
        స్వాగతమాంధ్ర జాతికిని సంస్కృతి సన్నుతి పొందు వృద్ధికిన్ 
ఆగత షడ్రుచీ కలన యానవయారపు వైజయంతికా !

సీ|| రాజు గురుడగును రాష్ట్రాధిపతివోలె
                                  సుస్థిరత్వము కల్గు శుభములందు !
మంత్రి భాస్కరుడగు మాన్య ప్రధానిలా
                                        కల్లోల మతమౌఢ్య కలతలందు !
నవనాయకులతో భవసాగరంబగు
                                        కర్ష కార్మిక శక్తి హర్ష ప్రదము!
సరుకు ధరవరలు పెరుగుటే ధరణిలో
                                                తరుగు దల నెపుడు దలపరాదు !

గీ||      పేదసాదల గతులెల్ల బీదగాను
                      ధనికులున్నత పీఠముల్ దాల్చుచుండ
               కొత్త వత్సర ఫలితమ్ము కోర్కె గాని
                           మార్పు లేముండు యోచింప తీర్పరులకు !

సీ||      పంచాంగ ప్రియులైన ప్రజలార వినరండి
                                                             ద్వాదశ రాశుల వర్ష ఫలము
ఆగ్రహాను గ్రహ నిగ్రహ గ్రహముల
                                                       ఘటనా ఘటనల సంఘటన తెలియ
ఏ రాశి మీదైన ఏ తార వారైన
                                                 ఫలితాల విషయమై కలత వలదు
కందాయ ఫలితముల్ ఖర్చుకున్ దగినట్లు
                                                       ఆదాయమును వ్యయం బప్పు బట్టి ||

గీ||     రాజపూజావమానము రాజకీయ
                 తంత్రమును బట్టి , రాశి సత్ఫలములెల్ల
      కొత్త వత్సర మందలి కోర్కె బట్టి
             గట్టి యత్నము చేసిన గాంచ గలరు.

15, మార్చి 2013, శుక్రవారం

శరదాపదాలు

శరదాపదాలు
                                                 -    పరాక్రి

దేవళం బిదియోరా
దేశకంబదురురా

సంధి సుందర మొచ్చె
కొత్త కొత్వాలు
దిబ్బిడి స్కూలు నేపాలు

అయ్యవారికి తోడు అతడు సగపాలు
సాగింప శివప్రసాదపు వాడి వేడు,
స్వస్థితికి అస్తిత్వ మొప్పార జూడు

పిసరెక్కు వంటాడు పసగాన నీడు
డీగ్రీల చూరెక్కి వర్సిటీ వంతుడై
నరసింగ మింతెరా సిరిసాగులేడు,

పువ్వుల సామిరా - ఏ పూట రాడో ?
బిగ్ బాసు విగ్రహంబును జూడ
నవ్వు నవ్వుల తోడు నాట్యాలనాడు

ఈలేసి గోలెట్టు ఇంపుగా గన్పట్టు
వెంకి మాటల పెంకి గానీ
ఇంకోడు సరిగాడు - పనికి లేడు ,

పొట్టోడు గట్టోడు గారవనీడు
పీనెవ్వి ఈక్వేషన్ రూటు వేరు
కార్యసాధకుడితడు, నాటకాలోడు

పోడుగాటి లెక్కల్లో మరమనిషి
పొదుపైన మృదుభాషి - నిత్యతోషి
అప్పల నాయుడే అరకొరలు దూసి

అందాల బిందువై అలరారుజ్యోతి
మందగమనయె గాని - సంద్రంపు సాక్షి
పాటల పేటికౌ - ఆరంపు జ్యోతి

ఆంగ్లేయ భాషాధికారి - సాకారి
రీజనింగుల బోల్చి రంగు దేల్చు
ఆచార్య వర్యుడాచారి మల్లి ||

చిత్తశాంతుల బూచు - నుదిటి బొట్టుల వాడు
గ్రామీణ సామెతల ఘూటు - గాటి
ట్రెజరియౌ కె గణేషు - టెంపరించు

మెత్త మెత్తగ నుండు చిత్తానదోపడు
లోతైన భావాల దేవుళ్ళు
ముభావంపు లొంపు - ముంగిళ్ళలందు ,


చిగురాకులందే చిందేయగలడు
గడులు నప్పించేటి - గడుసైనవాడు
కాణాచి నానాజి ,దోబూచులాడు

కంచు కంఠమువాడు కావలాపాటి
అంచున నెంచగ పొంచి - వొంచుదూరి
మూర్తి మంతపు మూర్ధన్యుడితడు

చిన్నబోవడు వీడు - చెన్నైనవాడు
మిన్ను మన్నుల తంపరల వెన్ను
గన్నవారి పేర - చిన్న రావు

లోకంపుదనతోటే- తానులోకపుదోటె
అన్నన్నా చిన్ని యప్పన్న
తప్పున్న దంటే - తూర్పార బట్టు

శిష్ఠ వాక్యము నేలు - నిష్ఠతో తుష్టిగా
ప్రస్తాన త్రయములో - పయనించు
సంఘజీవన శాస్త్ర మోహనడు ఘనడు

గొల్లు మన్నది ఈ నేల తల్లి
 డ్రిల్లు మాష్టరు రామ్ముర్తి
రాకతో మళ్ళీ మొగ్గలేయంగ ద్రుళ్ళి.


చంద్ర కాంతపు పూవు - సౌరులేపార
కళల కలకలల  - తళుకు తోడ
చంద్రకళ రాక - చారుగమమె.

కుందనపు పద్మంబు - కుర్చికి వెలుగు
ప్రిన్సిపల్సును లచ్చి పంచించి వచ్చు
పాఠశాలకు వీరు మినిష్టిరీ వారు

కంప్యూటరార్పగా నేర్పగా గలరు మాకు
అసలు లేకే గాని కొసలుకే మార్పు
తీర్పరుల మావూరు దిబ్బిడి వారు.

అచ్చోట పనిజేయ సచ్చితానందమై
హంసవింశతిగ గూర్చి అచ్చెరువు తోడ
పరాక్రి పదనిసల - సరదాల పాట

8, మార్చి 2013, శుక్రవారం

నిర్వచన ధర్మపత్ని

                                           నిర్వచన  ధర్మపత్ని
                                                                             - పరాక్రిజయ


శ్లో||   కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా
      రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, షట్ధర్మ యుక్తా కుల ధర్మపత్నీ ||

                                                         ( స్వేఛ్ఛానువాదం )

     సీ||      సేవలందించు  సంక్షేమ వర్తియై  
                             భావనా స్ఫూర్తితో భవిత  కొ
కు 
              అన్న పూర్ణాంబయై ఆకలి దీర్చుచు
                             రతికామ  రసరాజ్య  రంభయగుచు
              ముగ్ధ మోహన నీదు ముఖవిలాసజూచి
                             రూప లక్ష్మిగ నిన్ను రూఢి గొలుతు
              ఓర్పులో వసుధవై  నేర్పుగా  కూర్మితో
                                  జన్మ సార్ధకతను  చాటినావు

   గీ||        జాతి  జాగృతి పథ సంచార కతన
              గత  చరిత్రలు సాక్షమౌ  గాజులమ్మ
              నీదయా వర్ష సారపు నియమ మిదియె
              ఆరు ధర్మంబులొప్పెడి దాలి యగును