అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

25, ఆగస్టు 2012, శనివారం

శ్రీ సూక్తం



            శ్రీనివసరావు అదృష్టవంతుడు
            అదేం? ...అంటారా,
            మరొకర్ని మన్నించేప్పుడు మాత్రమే
            మనం’ శ్రీ’ ని వాడతాం  
            మనకి మనం శ్రీ ని చుట్టుకోలేం గదా |
            బార్టర్ సిస్టం లో ,లా ,
            పక్కవాళ్ళిస్తేనే మనకి వస్తుంది  "శ్రీ" 
            అందుకే అన్నాను శ్రీనివాసరావు 
            అదృష్టవంతుడని ,
            పెళ్ళి శుభలేఖలో,
            శ్రీమతి ऽ శ్రీ వ్రాయు శుభలేఖార్ధములు....
            అని వ్రాసుకుంటాం.
            అది శ్రీమతి వల్ల కలిసొచ్చిన ,
            శ్రీమాత్రమే   సుమండీ....
           కుమారి -శ్రీమతి కాలేక పోయినా,
           ఒకచో
           నిరుద్యోగి గోవింద రాజులు-
           సంబోధనలో ! శ్రీ గోవిందరాజులే అవుతాడు.
           యవ్వనం లో అడుగుపెట్టిన కుర్రవాడికి,
           శ్రీ---ని పెట్టి వ్రాసిచూడండి వాడి సంబరం...
          అందుకే అన్నాను ,
          శ్రీనివాసరావు  అదృష్టవంతుడని,
          పిల్లవాడని కొట్టిపారేయకండి కాని,
          మా బుల్లి శ్రీ ను గాడికి కూడా,
          శ్రీ- అంటే ఎంత మోజో.............
          వాడి తెలుగు నోట్సుపై ....శ్రీ శ్రీను  ఐదో తరగతి,
          అని వ్రాసుకున్నాడు,
          రెండు -శ్రీ,శ్రీ- లుచూడగానే
          గత శతాబ్దపు మహాకవి స్ఫురణ కొచ్చారు,
          అందుకే అన్నాను శ్రీనివాసరావు అదృష్టవంతుడని,
         
         మా అమ్మ తిరపతిలో మొక్కుకుందట,  
         నాకు ప్రమోషన్ వస్తే ,
         ఇంటిల్లబాది వచ్చి తలో వెయ్యా హుండీలో వేస్తామని,
         తిరిగొచ్చి గుండుతడుముకుంటూ ఖర్చులు లెక్కజూస్తే
         గుండె ఆగినంత పనయ్యింది... !
         అంతా కలియుగ దైవమైన శ్రీనివాసుని మహత్యం
         అందుకే అంటాను, 
         లచ్చి ఏకాక్షరమై, లక్కు తోడైతే
         శ్రీసూక్తం పఠించే వాడు,
         శ్రీనివాసరావు అదృష్టవంతులే//

2 కామెంట్‌లు:

  1. మీ 'శ్రీ'సూక్తం చదివి మిగిలినవారెలా అనుకున్నా
    నేను మాత్రం సంబర పడిపోయాను....:-)
    ఎందుకో వేరే చెప్పాలా?..:-))
    ఇంకో విశేషం కూడా ఉందండోయ్...
    నాకు తెలిసి 'శ్రీ' అనే సంయుక్తాక్షరానికి ఉన్న అర్థాలు
    మరే సంయుక్తాక్షరానికీ లేవేమో!...
    అభినందనలు మీకు...
    @శ్రీ (శ్రీనివాస్)

    రిప్లయితొలగించండి
  2. మీ శ్రీ సూక్తం చాలా బాగుంది. పరాక్రి గారూ!మొత్తానికి స్త్రీ సూక్తానికీ,శ్రీ సుక్తానికి ముడి పెట్టి కవితాశ్రీని పండించారు.అభినందనలు.

    రిప్లయితొలగించండి