సాధ్య బిందువు- శాంతం పాపం
అకారాదిగ క్షకారాంతం
అక్షరాలను వ్రాయ బూని
పదాలల్లి కదంద్రొక్కే
కవన రాశిని మూసబోస్తే (తె)
ధ్వనించే శబ్దవారాశిగ
పదార్ధంలో యదార్ధంగా ప్రబోధం
చైతన్యమొందే సిరాచుక్కే ,
బిందు వందున చిందులాడే
సింధువు - దార్శనికమై
అల్లకల్లోలాలను, ఒడ్డునుండి,
గభీర నీర సారాలలో, గ్రుంకులిడుచు
తరం తరం నిరంతరం స్వాంతన లేకుండా
తుది నాదని స్పృశించాలంటే
సింధువైన బిందు రూపము
పొంది నపుడే అది సుసాధ్యం ?
వెసులు బాటుకు వెర్రీ తలలై
కుళ్ళుబోతుల లోకమాలోకమైతే
మానవాలే తనకు తానే
సునామీలను సృష్టించుకుంటే
- అదెప్పటికీ అసాధ్యమే ?
సింధువు అంటే అర్ధం చెప్పగలరా..
రిప్లయితొలగించండిసింధువు అంటే సముద్రము
రిప్లయితొలగించండి