అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

17, సెప్టెంబర్ 2012, సోమవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 6

6. సమస్య:- "మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగమయ్యెడిన్"
ఉ|| యవ్వన శోభమీర తనయందము డెందములందు గుందగా
    అవ్వన కేకి పోకడల ఆటకు పాటకు సాటి భళా యీ
    జవ్వని నాట్యకత్తె సరసఙుల దవ్వుల చిందులాడగా
  "మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగమయ్యెడిన్" ||

1 కామెంట్‌:

  1. అవ్వన సీమ మధ్యమున నా మురళీ ధరుడల్ల ప్రేమపుం
    బువ్వల బెట్టి గోపికల ముగ్ధ మనోహర లాలనమ్మునన్
    యవ్వన వాంఛలన్ దనుప నా యమునా తటి నాటి రేయిలో
    మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్.

    రిప్లయితొలగించు